Telugu Gateway
Politics

ఆడియోల్లో వరస పెట్టి దొరుకుతున్న బిజెపి నేతలు

ఆడియోల్లో వరస పెట్టి దొరుకుతున్న బిజెపి నేతలు
X

కర్ణాటక రాజకీయాలు శనివారం నాడు ఎన్నడూలేనంత ఉత్కంఠను రేపాయి. ఓ వైపు ప్రొటెం స్పీకర్ బోపయ్యకే సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో బిజెపికి ఒకింత నైతిక బలం వచ్చినట్లు అయింది. అయితే సుప్రీంకోర్టు బలపరీక్షకు సంబంధించిన వ్యవహారం అంతా లైవ్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో కాంగ్రెస్, జెడీఎస్ కోరిన కోరికలు అన్నింటిని ఆమోదించింది. ఇదిలా ఉంటే మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేతో జరిగిన బేరసారాల టేపు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. అందులో గాలి జనార్థన్ రెడ్డి ఏకంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేరు కూడా ప్రస్తావించినట్లు నమోదు అయింది.

అయితే బిజెపి మాత్రం ఇదంతా బోగస్ అని..ఆడియో టేపులు నిజం కావని ఆరోపిస్తోంది. బలపరీక్షకు ముహుర్తం ముంచుకొస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తనయుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సాగించిన బేరసారాల ఆడియో టేపులను విడుదల చేశారు. అయితే ఇది కూడా మిమిక్రీ అని బిజెపి కొట్టిపారేస్తోంది. ఏమైనా ఈ ఆడియో టేపుల వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. యడ్యూరప్ప తనయుడు విజయేంద్ర తమ ఎమ్మెల్యేలకు ఐదు కోట్ల పదవి ఆఫర్ చేసినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. అంతే కాదు..ఏకంగా సీఎం యడ్యూరప్ప పై కూడా విమర్శలు విన్పిస్తున్నాయి.

Next Story
Share it