Telugu Gateway
Andhra Pradesh

స్వాతంత్ర్య పోరాటంలో చంద్రబాబు..నారా లోకేష్!

స్వాతంత్ర్య పోరాటంలో చంద్రబాబు..నారా లోకేష్!
X

అదేంటి..నాలుగేళ్ల తర్వాత వీళ్లు చేస్తున్నది ప్రత్యేక హోదా పోరాటం కదా?. స్వాతంత్ర్య పోరాటానికి వీళ్లకు సంబంధం ఏమిటి అంటారా?. ఏమో చంద్రబాబునాయుడు చెప్పారు. అందరూ వినాల్సిందే. కాదు..కూడదంటే చంద్రబాబుకు కోపం వస్తుంది కాబట్టి ఎవరూ మాట్లాడటం లేదు. ధర్మపోరాట దీక్షలో భాగంగా సోమవారం నాడు చంద్రబాబు తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సబలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేంటి అంటే ‘మమ్మల్ని భయపెడతారా?. బ్రిటీష్ వాళ్లపైనే పోరాడిన జాతి. తెలుగుదేశం పార్టీ’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే సోషల్ మీడియాలో చంద్రబాబు వ్యాఖ్యలపై రకరకాలు జోకులు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాదు..మహాత్మాగాంధీతో చంద్రబాబు, లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి...బ్రిటీషర్లతో జరిగిన పోరాటంలో గాంధీజీ వెనక ఉండి నడిపించిన చంద్రన్న అంటూ ఫోటోలు పెడుతూ నవ్వులు పూయిస్తున్నారు.

అంతే కాదు..సుభాష్ చంద్రబోసుతో నారా లోకేష్ ఉన్న ఫోటోలు కూడా సిద్ధం చేసి..భారీ ఎత్తున ఫేస్ బుక్..వాట్సప్ ల్లో సర్కులేట్ చేస్తున్నారు. ఇవి తెలుగుదేశం పార్టీ ప్రత్యర్ధులే తయారు చేసినా...వీటిని చూసిన వారెవరూ నవ్వాపుకోలేకపోతున్నారు. ఈ మార్ఫింగ్ ఫోటోలు...వాట్సప్, ఫేసుబుక్ లో వైరల్ గా మారుతున్నాయి. దేశంలోనే సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు నుంచి తిరుపతి సభలో వచ్చిన మాటలు చూసి టీడీపీ నేతలు కూడా షాక్ కు గురయ్యారు.

(నోట్. ఈ ఐటెంలో వాడిన ఫోటో వైైరల్ గా మారింది. ఇది మార్ఫింగ్ ఫోటో. వాస్తవం కాదు. విషయం తెలియజేయటం కోసం దీన్నీ వాడటం జరిగింది. దీంతో పాటు సుభాష్ చంద్రబోస్ తోపాటు లోకేష్ నడుస్తున్న ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. అదీ చంద్రబాబు వ్యాఖ్యల ఆధారంగా)

Next Story
Share it