Telugu Gateway
Andhra Pradesh

ప్రచార బాబు...ఆ బిరుదు మోడీకిచ్చేశారు

ప్రచార బాబు...ఆ బిరుదు మోడీకిచ్చేశారు
X

ఒక రాజధానికి మూడు శంకుస్థాపనలు. కీలక ప్రాజెక్టులకూ అంతే. ఎందుకంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిత్యం ప్రచారం కోరుకుంటారు. చేసేది తక్కువ అయినా.. ఎంతో ఎక్కువ చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటారు. దీనికి సహకరించే మీడియా ఎలాగూ ఉండనే ఉంది. లేనిది ఉన్నట్లు చూపించటంలో....ప్రచారం చేసుకోవటంలో ఏపీ ముఖ్యమంత్రికి దేశంలోనే ఎవరూ సాటిరారు. నూతన రాజధానికి సంబంధించి గ్రాండ్ గ్రాండ్ డిజైన్లతో మాయ చేశారు ఇప్పటిదాకా..కానీ ఒక్కటి కూడా ఇప్పటివరకూ గ్రౌండ్ కాలేదు. పదిహేను వందల కోట్ల రూపాయలు పెట్టి ‘పట్టిసీమ’ కట్టి...దేశంలోనే రెండవ అతిపెద్ద ప్రాజెక్టు అయిన నాగార్జున సాగర్ కట్టిన వారి కంటే ఎక్కువ ప్రచారం చేసుకున్నది..చేసుకుంటున్నది చంద్రబాబే. రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ముంబయ్ కు చెందిన ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీకి అప్పగిస్తే..ఇదే విషయంపై మోడీ సీరియస్ అయి..ఈ ఒఫ్పందాన్ని రద్దు చేస్తే తప్ప...ముందుకు రానని ప్రకటించిన సంగతి తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు అప్పుడు కూడా ‘నేను చెపితేనే మోడీ నోట్లు రద్దు చేశారు. ’ అంటూ కొన్ని రోజులు ప్రచారం చేసుకున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో తర్వాత మళ్ళీ మాట మార్చారు.

భాగస్వామ్య సదస్సుల్లో మోడీ మేకిన్ ఇండియాను ఊదరగొట్టారు చంద్రబాబు. ఇఫ్పుడు అది ఫెయిల్ అని తేల్చేశారు. నిన్న మొన్నటివరకూ కేవలం ఏపీకి అన్యాయం చేసినందునే మోడీని వ్యతిరేకిస్తున్నామని ప్రకటించిన చంద్రబాబు...ఇప్పుడు రూటు మార్చి అసలు మోడీ దేశానికి ఏమీ చేయలేదని, వచ్చే ఎన్నికల్లో బిజెపి గెలిచే సీన్ లేదని చెబుతున్నారు. మరి అదే బిజెపి ప్రభుత్వంలో మూడున్నరేళ్ళకు పైగా భాగస్వామిగా ఉన్నప్పుడు మోడీ ప్రచారయావను చంద్రబాబు గుర్తించలేదా?. ఇప్పుడే మోడీ ప్రచార ఆర్భాటం చంద్రబాబుకు కన్పించిందా?. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ అంతే. సోమవారం పోలవరం అంటూ హంగామా చేశారు...2018 చివరికి ప్రాజెక్టు తొలి దశ పూర్తి అవుతుందని నమ్మించారు. తీరా సీన్ కట్ చేస్తే అదీ ఉత్తుత్తి ప్రచారమే అని తేలిపోయింది. అసలు కాంట్రాక్టర్ పనులు చేయకపోయినా ‘ఉరుకులు..పరుగులు’ అంటూ కొన్ని సంవత్సరాల పాటు ప్రజలను నమ్మించారు. కానీ చివర్లో మాత్రం పనులు ముందుకు సాగాలంటే కాంట్రాక్టర్ ను మార్చాలంటూ తప్పు ఆయనపై వేసి ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు ‘ప్రచార గిమ్మిక్’లు ఎన్నో.

Next Story
Share it