Telugu Gateway
Telangana

భరత్ అనే నేను ఫంక్షన్ కు ‘శ్రీ చైతన్య ప్రకటనా?’

భరత్ అనే నేను ఫంక్షన్ కు ‘శ్రీ చైతన్య ప్రకటనా?’
X

హీరో మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ తమ పరువు తామే తీసుకున్నారు. ‘భరత్ అనే నేను’ సినిమా చాలా వరకూ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఓ యువ ముఖ్యమంత్రిగా మహేష్ బాబు యాక్షన్ కు విశేష ఆదరణ లభించింది. నిజజీవితంలో అలాంటి సంఘటనలు జరగవు కాబట్టి...సినిమాల్లో అయినా అలా జరిగిందుకు చాలా మంది సినిమాకు కనెక్ట్ అయ్యారు. అందులో ముఖ్యమైనవి విద్యా వ్యవస్థలో మార్పులు..గ్రామస్వరాజ్యం వంటి అంశాలు కీలకమైనవి. అయితే తాజాగా చిత్ర నిర్మాతలు విడుదల చేసిన వీడియోలో కార్పొరేట్ సంస్థల ప్రతినిధిని సీఎం హోదాలో మహేష్ బాబు లాగిపెట్టి కొట్టిన సంఘటన ఒకటి సంచలనం సృష్టించింది. అసలు ఈ సీన్ సినిమాలో ఎందుకు పెట్టలేదు అనే విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. నిజానికి అది ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యే అంశం. అందుకే ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు కూడా. అంతే కాదు..అందరూ ఒకటే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ బిట్ ఎందుకు పెట్టలేదు అని?. ఎందుకుంటే చదువుకునే పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు విద్యా రంగం కార్పొరేట్ అయిన ఫలితాన్ని చవిచూస్తున్నారు కాబట్టి.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ అంశం పెద్ద దుమారమే రేపుతోంది. కొద్ది రోజుల క్రితం భరత్ అనే నేను సినిమాకు సంబంధించి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ జరిగాయి. దీనికి కార్పొరేట్ విద్యా రంగంలో ఉన్న శ్రీ చైతన్య యాడ్ తీసుకోవటం ఇఫ్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఈ కార్యక్రమాన్ని ప్రజంట్ చేసింది ఈ సంస్థే కావటం విశేషం. ఓ వైపు భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు, కొరటాలలు ప్రభుత్వ విద్యావిధానాన్ని ఎలా మార్చాలో సందేశం ఇచ్చి..బయట సినిమా కార్యక్రమానికి శ్రీచైతన్య యాడ్ తీసుకోవటం ఏ మేరకు నైతికం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా ఎంత హిట్ అయినా కూడా ఈ చర్య ద్వారా అటు కొరటాల..ఇటు మహేష్ బాబుల ఇమేజ్ కు మాత్రం భారీ నష్టం జరగటం ఖాయం.

Next Story
Share it