దాచేపల్లి నిందితుడి ఆత్మహత్య

గుంటూరు జిల్లాలో కలకలం రేపిన రేప్ కేసులో నిందితుడైన సుబ్బయ్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఓ చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు విడిచారు. రెండు రోజులుగా సుబ్బయ్య కోసం గాలిస్తున్న పోలీసులకు సుబ్బయ్య ఆత్మహత్య విషయం తెలిసింది. గురజాల దైదా దగ్గర ఆయన చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అమరలింగేశ్వర దేవాలయం వద్ద మృతదేహాన్ని గుర్తించారు. తొమ్మిదేళ్ళ బాలికపై 55 సంవత్సరాల వయస్సు ఉన్న సుబ్బయ్య అత్యాచారం చేయటం ఏపీలో పెద్ద కలకలం రేపిన విషయం తెలిసిందే. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు, పార్టీలు,, ప్రజలు డిమాండ్ చేశారు. ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఆచూకి తెలుసుకునే ప్రయత్నం చేసిన పోలీసులకు ఈ ఆత్మహత్య విషయం తెలిసింది.
మరో వైపు దాచేపల్లి అత్యాచార ఘటన దురదృష్టకరమని ఏపీ హోం మంత్రి చినరాజప్ప తెలిపారు. శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలిని శుక్రవారం చినరాజప్ప పరామర్శించారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లాలో వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటివి జరుగకుండా ప్రజల్లో కూడా అవగాహన రావాలని, మీడియా చైతన్య పర్చాలని చినరాజప్ప కోరారు. బాధితురాలి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ. 5లక్షల పరిహారం ప్రకటించింది.
మునుగోడు ఉప ఎన్నిక..టీఆర్ఎస్ అనుకుంటే వస్తది..లేదంటే లేదు!
2 Aug 2022 2:38 PM GMTఎలన్ మస్క్ ప్రైవేట్ ఎయిర్ పోర్టు!
2 Aug 2022 12:41 PM GMTఏటీఎంలో 'స్ట్రక్ అయిన బిజెపి అగ్రనేతలు!'
2 Aug 2022 12:04 PM GMT'మ్యూట్' లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్!
2 Aug 2022 6:45 AM GMTదిల్ రాజు 'డబుల్ గేమ్' దుమారం!
1 Aug 2022 3:16 PM GMT
మునుగోడు ఉప ఎన్నిక..టీఆర్ఎస్ అనుకుంటే వస్తది..లేదంటే లేదు!
2 Aug 2022 2:38 PM GMTఏటీఎంలో 'స్ట్రక్ అయిన బిజెపి అగ్రనేతలు!'
2 Aug 2022 12:04 PM GMTజగన్ ..మీరు తోడుదొంగలు..సోము వీర్రాజుకు అమరావతి రైతుల షాక్!
29 July 2022 7:53 AM GMTగజ్వేల్ అయినా రెడీ..హుజూరాబాద్ అయినా ఓకే
26 July 2022 2:57 PM GMTమునుగోడు బలం బిజెపిదా..రాజగోపాల్ రెడ్డిదా?!
26 July 2022 10:58 AM GMT