బిజెపిలో చేరిన హీరోయిన్
BY Telugu Gateway5 May 2018 3:53 PM IST
X
Telugu Gateway5 May 2018 3:53 PM IST
టాలీవుడ్ కు చెందిన హీరోయిన్ మాధవిలత బిజెపిలో చేరారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో ఆమె బిజెపి కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ దత్తాత్రేయ. ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు. మాధవిలతకు గత కొంత కాలంగా టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు లేవు. దీంతో పొలిటికల్ ఆరంగ్రేటం చేసినట్లు కన్పిస్తోంది. పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ పై ఆమె కొద్ది కాలం క్రితం గళం విప్పారు. ఇదే కారణంతో తాను సినిమాల్లో అవకాశాలు వదులుకోవాల్సి వచ్చిందని చెప్పి సంచలనం రేపారు. బిజెపిలో చేరిన సందర్భంగా మాధవిలత మాట్లాడుతూ బిజెపి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తొలుత జనసేన వైపు ఆసక్తి చూపిన మాధవిలత ఆకస్మికంగా బిజెపిలో చేరిపోయారు.
Next Story