Telugu Gateway
Andhra Pradesh

వైసీపీ ఎంపీల రాజీనామా

వైసీపీ ఎంపీల రాజీనామా
X

పార్లమెంట్ సమావేశాల చివరి రోజున వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. ముందు నుంచి ప్రకటించినట్లుగానే ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు శుక్రవారం లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు తమ రాజీనామా పత్రాలు అందజేశారు. స్పీకర్ ఫార్మెట్ లోనే ఈ రాజీనామా పత్రాలు ఉన్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటంలో కేంద్ర నిర్ల్యక్షానికి నిరసనగా తమ ఎంపీలు రాజీనామా చేస్తారని గతంలోనే ఆ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే స్పీకర్ సుమిత్రా మహాజన్ రాజీనామాలపై పునరాలోచించుకోవాల్సిందిగా వైసీపీ ఎంపీలకు సూచించినట్లు సమాచారం.

అయినా వారు తమ రాజీనామా పత్రాలు అందజేసి..ఏపీ భవన్ లో నిరాహారదీక్షకు బయలుదేరి వెళ్ళారు. వైసీపీ ఎంపీల రాజీనామాపై జగన్ ట్విట్టర్ లో స్పందించారు. తమ ఎంపీలు ముందు ప్రకటించినట్లుగానే రాజీనామా చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సవాల్ విసురుతున్నానని...టీడీపీ ఎంపీలు కూడా తమ పదవులకు రాజీనామా చేసిన ఏపీకి రావాల్సిన చట్టబద్దమైన హక్కు అయిన ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలన్నరు. అలా చేస్తే అందరూ ఒక్కటై పోరాడుతున్నట్లు అవుతుందని అన్నారు.

Next Story
Share it