Telugu Gateway
Andhra Pradesh

ఢిల్లీలో ముగిసిన వైసీపీ ఎంపీల దీక్ష

ఢిల్లీలో ముగిసిన వైసీపీ ఎంపీల దీక్ష
X

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక కోరుతూ ఢిల్లీలో వైసీపీ ఎంపీలు చేస్తున్న నిరాహారదీక్ష బుధవారంతో ముగిసినట్లు అయింది. వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డిల ఆరోగ్యం క్షీణించటంతో పోలీసులు వీరిని బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. అంతకు ముందే వై వీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్ లు తీవ్ర అస్వస్థతకు గురి అవ్వటంతో వారిని కూడా ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 6న పార్లమెంట్ వాయిదాపడిన తర్వాత వైసీపీ ఎంపీలు తమ రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ కు అందజేసి..నేరుగా ఏపీ భవన్ లో దీక్షకు కూర్చున్న సంగతి తెలిసిందే. గత ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న మిథున్‌, అవినాష్‌ల ఆరోగ్యం విషమించడంతో వారిని బుధవారం రాంమనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు.

వారికి ఫ్లూయిడ్స్ ఎక్కించారు. ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రి సీనియర్‌ వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం ఎంపీలు మిథున్‌, అవినాష్‌ ఉన్నారు. వైసీపీ ఎంపీల దీక్షకు మద్దతుగా ఏపీలో వైసీపీ పలు కార్యక్రమాలు చేపట్టింది. మంగళవారం నాడు జాతీయ, రాష్ట్ర రహదారులపై ధర్నాలు చేసి వైసీపీ..బుధవారం నాడు పలు జిల్లాలోని రైలు రోకోలు నిర్వహించారు. రైల్ రోకోలో పాల్గొన్న వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story
Share it