చంద్రబాబుకు షాక్
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ జంపింగ్ లు మొదలయ్యాయి. అధికార టీడీపీ ఎన్ని హామీలు ఇచ్చినా కొంత మంది నేతలు ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. అందుకే ప్రత్యక్ష ఉదాహరణే మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి. కొద్ది రోజుల క్రితం ఎంపీ కేశినేని నానితో కలసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. అప్పటికే ఆయన పార్టీ మారటానికి నిర్ణయించుకున్నారు. చంద్రబాబు ఆయన్ను శాంతపరిచే ప్రయత్నాలు చేశారు. అప్పటికి ఓకే అన్నా..ఆయన సోమవారం నాడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. పాదయాత్రలో ఉన్న జగన్ తో ఆయన అరగంట పాటు మాట్లాడినట్లు సమాచారం.
జగన్‌తో అన్ని విషయాలు మాట్లాడిన అనంతరం వైసీపీ కండువా కప్పుకోవడానికి రవి సిద్ధమయ్యారు. ఈ నెల 14నే యలమంచిలి రవి వైసీపీలో చేరనున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్.. విజయవాడలోకి అడుగుపెట్టిన మొదటి రోజే వైసీపీలోకి రవి చేరనున్నారు. పెద్ద ఎత్తున సభపెట్టి జగన్ సమక్షంలో యలమంచిలి రవి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. ఇది అధికారిక టీడీపికి షాకే అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.