క్రిస్టియన్ అని చెప్పినా..అనితకు టీటీడీ బోర్డులో చోటు

ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ‘తిరుమల వెంకటేశ్వరస్వామి’ని నిత్యం వివాదాల్లోకి లాగుతున్నాడు. ఇప్పటికే టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ క్రీస్తు సువార్త సభలకు హాజరయ్యారని..ఆయన క్రిస్టియన్ సానుభూతిపరుడు అంటూ వివాదం సాగుతున్న తరుణంలో టీడీపీ ఎమ్మెల్యే, కొత్తగా టీటీడీ బోర్డులో నియమితులైన వంగలపూడి అనిత వీడియో ఒకటి దుమారం రేపుతోంది. ఆమె స్వయంగా తాను క్రిస్టియన్ ను అని ఓ ఛానల్ ఇంటర్వ్యూలో బహిరంగంగా చెప్పింది. అయినా సరే ఆమెకు ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ బోర్డు సభ్యురాలిగా నియమించారు. ఓ వైపు ఛైర్మన్ వ్యవహారమే వివాదంలో ఉండగా..ఇప్పుడు అనిత వీడియో కొత్త దుమారం రేపుతోంది. తాను బైబిల్ బ్యాగులో లేనిదే బయటకు కూడా రానని అనిత ప్రకటించారు.
దీంతో పాటు ఓ వైపు బిజెపితో తాను పోరాటం చేస్తున్నానని..మోడీ మెడలు వంచుతున్నానని బీరాలు పలికే చంద్రబాబునాయుడు...ఏకంగా బిజెపికి చెందిన మహారాష్ట్ర మంత్రి సతీమణికి బోర్డులో చోటు కల్పించారు. ఆమెకు ఇవ్వకూడదనే నిబంధన ఏమీలేకున్నా..బిజెపితో జట్టుకట్టే పరిస్థితి లేదని...చెబుతున్న చంద్రబాబు ఈ తరుణంలో బిజెపి మంత్రి భార్యకు టీటీడీ బోర్డులో చోటు కల్పించటం ద్వారా తన లాలూచీ రాజకీయాన్ని చూపారనే విమర్శలు విన్పిస్తున్నాయి. అన్నింటి కంటే ముఖ్యంగా అనిత స్వయంగా తాను క్రిస్టియన్ అని ప్రకటించటం వివాదం రేపే అవకాశం కన్పిస్తోంది. హిందు మతంపై విశ్వాసం ఉన్న వారినే సహజంగా టీటీడీ బోర్డులో నియమిస్తారు. కానీ చంద్రబాబు మాత్రం తన రాజకీయ అవసరాల కోసం వెంకటేశ్వరస్వామితో కూడా రాజకీయం చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
https://www.facebook.com/goginenideepthi007/videos/237450140147710/
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTఅసెంబ్లీ రద్దుకు మేం రెడీ..పార్లమెంట్ రద్దుకు మీరు రెడీనా?
27 May 2022 2:15 PM GMTటాలీవుడ్ కు టిక్కెట్ రేట్ల షాక్
27 May 2022 10:30 AM GMTరాష్ట్రం పరువు తీస్తున్న జగన్
27 May 2022 9:33 AM GMTడ్రగ్స్ కేసులో షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్
27 May 2022 8:23 AM GMT
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTకాంగ్రెస్ అంటేనే అన్ని కులాల కలయిక
26 May 2022 7:15 AM GMTమోడీ తెలంగాణ టూర్..టీఆర్ఎస్ వర్సెస్ బిజెపి
26 May 2022 6:55 AM GMTఇక పార్టీ తోకలు తగిలించుకోదలచుకోలేదు
26 May 2022 5:22 AM GMTమీ వైఫల్యాలను మాపై రుద్దకండి
24 May 2022 2:00 PM GMT