Telugu Gateway
Telangana

దగ్గుబాటి అభిరామ్ ఫోటోలు విడుదల చేసిన శ్రీరెడ్డి

దగ్గుబాటి అభిరామ్ ఫోటోలు విడుదల చేసిన శ్రీరెడ్డి
X

శ్రీ రెడ్డి. ఈ పేరు ఎత్తితే చాలు టాలీవుడ్ ఉలిక్కిపడుతోంది. ఎప్పుడు ఏ పక్క నుంచి ఎవరు పేరు బయటపెడుతుందో అన్న టెన్షన్ చాలా మందిలో నెలకొంది. తొలుత సీనియర్ దర్శకులపై ఆరోపణలు చేసి..ఏదో సరదా కోసం ఇలా చేశాను అంటే..అందరూ ఫేక్ అనుకున్నారు. కానీ తర్వాత సీన్ మారింది. ఇప్పుడు ఏకంగా శ్రీ రెడ్డి దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు అభిరామ్ తో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలను విడుదల చేసింది. ఇవి ఇప్పుడు పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా పదికిపైన ఉన్న ఫోటోలను శ్రీ రెడ్డి బహిర్గతం చేసింది. అంతే కాదు...టాలీవుడ్ కు చెందిన ప్రముఖ మాటల రచయితకు సంబంధించిన వాట్సప్ చాటింగ్ హిస్టరీని కూడా బయటపెట్టింది. అంతే కాదు...సంచలన చిత్రాల దర్శకుడి వాట్సప్ చాటింగ్ హిస్టరీని కూడా శ్రీ రెడ్డి బహిర్గతం చేసింది. ఇటీవల శ్రీ రెడ్డి ‘మా’ ఆఫీసు దగ్గర అర్థనగ్న ప్రదర్శన చేయటం..కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ‘మా’ కూడా అంతే స్థాయిలో తీవ్రంగా స్పందించి శ్రీ రెడ్డికి మా సభ్యత్వం ఇచ్చేదేలేదని..ఎవరైనా ఆమెతో సినిమాలు చేస్తే వారి సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తామని ప్రకటించింది.

మరి ఏకంగా ప్రముఖ డైరక్టర్లు..మాటల రచయితల అసలు రంగు బయటపడుతుంది కదా?. మరి వారిపై మా చర్య తీసుకోగలదా?. మా కు నిజంగా అంత దమ్ముందా?. అంటే నో ఛాన్స్ అంటున్నాయి పరిశ్రమ వర్గాలు.. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ కొత్తగా వచ్చిన అంశం కాకపోయినా..శ్రీ రెడ్డి మాత్రం ఓ పెద్ద తేనెతుట్టెను కదిపింది. చాలా మంది హీరోయిన్లు కూడా తాము దర్శక, నిర్మాతలు చెప్పినట్లు వినకపోతే అవకాశాలు రావని..తమను పక్కన పెట్టేస్తారని చెప్పిన విషయం తెలిసిందే. అయితే కొంత మంది ఈ విషయాన్ని చెబుతున్నారు..మరికొంత మంది మౌనంగా ముందుకు సాగుతున్నారు. మొత్తానికి శ్రీ రెడ్డి దుమారం టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it