Telugu Gateway
Cinema

శ్రీరెడ్డి టాజా టార్గెట్ ’న్యాచురల్ హీరో’

శ్రీరెడ్డి టాజా టార్గెట్ ’న్యాచురల్ హీరో’
X

టాలీవుడ్ లో మొదలైన దుమారం కొనసాగుతూనే ఉంది. కొద్ది రోజుల క్రితం ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములను టార్గెట్ చేసిన నటి శ్రీరెడ్డి ఇప్పుడు మరో బాంబు పేల్చింది. శ్రీరెడ్డి తనపై చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం నిజంలేదని..బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే తాను న్యాయపరంగా ముందుకెళ్ళాల్సి ఉంటుందని శేఖర్ కమ్ముల హెచ్చరించారు. అయినా ఆమె చాలా లైట్ తీసుకుని..మీ తప్పేమీలేదంటున్నారుగా..ఎందుకంత సీరియస్ అవుతారు.. నేను ఏదో నా అబిమానుల కోసం రాసుకుంటా అంటూ మరో పోస్టు పెట్టి కలకలం రేపారు. ఇప్పుడు మరోసారి ప్రముఖ హీరోను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇవి నిజమా? లేక గతంలో శేఖర్ కమ్ములపై పెట్టినట్లు పెట్టినవా అన్న విషయం మాత్రం తేలాల్సి ఉంది. టాలీవుడ్‌లోని కాస్టింగ్‌ కౌచ్‌ సంస్కృతి, సినీ అవకాశాల పేరిట వర్థమాన నటీమణులు, అమ్మాయిలను వాడుకుంటున్న తీరును బయటపెట్టి.. టాలీవుడ్‌లో దుమారం రేపిన శ్రీరెడ్డి తన ఆరోపణలను కొనసాగిస్తోంది.

తాజాగా ఫేస్ బుక్ లో ఫోస్టు పెడుతూ సినీ తెరమీదే కాదు నిజ జీవితంలోనూ ఆయన ‘నాచురల్‌’గా నటిస్తాడని, ఆయన ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడని శ్రీరెడ్డి ఆరోపించారు. స్టార్‌హీరోలు రాంచరణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ నుంచి అతను నేర్చుకోవాల్సింది చాలా ఉందని, వారికి అహంభావం లేదని, కానీ అతనికి యాటిట్యూడ్ చాలా ఉందని పేర్కొన్నారు. అతనికి ఈ మధ్యే కొడుకు పుట్టాడని అభినందనలు చెప్తూనే.. చేసిన తప్పులకు అతను కచ్చితంగా ఇబ్బందుల్లో పడతాడని, సినీ పరిశ్రమ అతన్ని శిక్షిస్తుందని, ఇండస్ట్రీ నుంచి ఇలాంటివన్నీ ఈకలా రాలిపోవాలంటూ ఆగ్రహంగా పోస్టు చేశారు. ప్రజలను ఎమోషనల్‌ అత్యాచారానికి గురిచేస్తావు. చిన్న దర్శకులను నువ్వు గౌరవించవు. సక్సెస్‌ అయిన తర్వాత నీకు యాటిట్యూడ్‌ పెరిగిపోయింది. ఇలాంటి వ్యక్తులకు శిక్ష పడటానికి కొంత టైమ్ పట్టొచ్చు అంతే. నువ్వు కచ్చితంగా ఇబ్బందుల్లో పడతావు. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Next Story
Share it