Top
Telugu Gateway

జెన్నీఫర్ లోపెజ్ ఇంట్లో రవితేజ సినిమా

జెన్నీఫర్ లోపెజ్ ఇంట్లో రవితేజ సినిమా
X

అదేంటి అనుకుంటున్నరా?.. అవును అమెరికాలోని ఈ పాప్ స్టార్ ఇంట్లో ప్రస్తుతం రవితేజ సినిమా షూటింగ్ సాగుతోంది. ఈ సినిమాను శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ‘అమర్..అక్భర్..అంటోనీగా’ రవితేజ మూడు పాత్రల్లో కన్పించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రవితేజకు జోడీగా అను ఇమాన్యుయల్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. జెన్నీఫర్ లోపెజ్ ఇంట్లో జరుగుతున్న విషయాన్ని శ్రీనువైట్ల ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘ఆమెకు వీరాభిమానిని.

లక్షల మంది అభిమాన పాప్‌ గాయని. పాప్ రాణి. ప్రస్తుతం ఆమె నివాసంలో షూటింగ్ చేస్తున్నాం. కల నిజమైంది’ అంటూ ట్వీట్ చేశారు శ్రీనువైట్ల. గతంలో రవితేజ హీరోగా శ్రీనువైట్ల తెరకెక్కిన వెంకీ, దుబాయ్‌ శీను సినిమాలు మంచి విజయం సాధించాయి. దీంతో అమర్‌ అక్బర్‌ ఆంటోనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కేవలం జెన్నీపర్‌ లోపేజ్‌ కు చెందిన విలాసవంతమైన విల్లాలో జరిగే చిత్రీకరణ కోసం భారీ మొత్తాన్ని కేటాయించారన్న ప్రచారం జరుగుతోంది.

Next Story
Share it