Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు... సెల్ఫీరాజా

చంద్రబాబు... సెల్ఫీరాజా
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ టూర్ పై కాంగ్రెస్ పార్టీ కూడా ఎటాక్ ప్రారంభించింది. చంద్రబాబును పీసీసీ అధ్యక్షుడు సెల్ఫీ రాజాగా పోల్చారు. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు ఫొటోలకు పోజులివ్వడం తప్ప.. చేసిందేమీ లేదని రఘువీరారెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం గురువారం కాంగ్రెస్‌ పార్టీ తిరుపతిలో 48 గంటల పాటు దీక్ష చేపట్టింది. ఈ కార్యక్రమంలో రఘువీరారెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. చంద్రబాబు సెల్ఫీ రాజా అని ఏద్దేవా చేశారు.

ప్రత్యేక హోదాపై ఆయనకు చిత్తశుద్ది లేదని మండిపడ్డారు. పార్లమెంటును ప్రజా దేవాలయంగా చంద్రబాబు భావించలేదని ఆరోపించారు. హోదా కోసం కాంగ్రెస్‌ 29 రాష్ట్రాలలో తీర్మానాలు చేయించిదని గుర్తు చేశారు. అంతేకాకుండా హోదా కోసం రాహుల్‌ గాంధీ తొలి సంతకం చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదాపైనే చేస్తారని రఘువీరా చెబుతున్నారు.

Next Story
Share it