టీటీడీ కొత్త బోర్డు సభ్యులు వీరే

ఏడాది పాటు జాప్యం తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎట్టకేలకు టీటీడీ బోర్డు నియామకం చేపట్టారు. తొలుత టీటీడీ బోర్డు ఛైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ ను నియమించారు. శుక్రవారం నాడు నూతన బోర్డు సభ్యులను ప్రకటించారు. సభ్యులుగా ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే జీఎస్‌ఎస్ శివాజీ, ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్యే అనిత, ఎమ్మెల్యే పార్థసారధి, ఎమ్మెల్యే చల్లా రామచంద్రారెడ్డి, పొట్లూరి రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, మేడా రామచంద్రా రెడ్డి, డొక్కా జగన్నాధం, సండ్ర వెంకట వీరయ్య(తెలంగాణ), ఇనుగాల పెద్దిరెడ్డి(తెలంగాణ), సుధా నారాయణ మూర్తి(కర్ణాటక), సప్న మునగంటివార్ (మహారాష్ట్ర) నియమితులయ్యారు. పొట్లూరి రమేష్ బాబు న్యాయ వ్యవస్థలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తి సమీప బంధువు అని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే బోర్డు కూర్పుపై పార్టీ వర్గాల్లోనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తిగా రాజకీయ కోణంలోనే బోర్డు ఉంది తప్ప..ఎక్కడా ఆథ్యాత్మిక భావం ఉన్న వారు కన్పించటం లేదని చెబుతున్నారు.
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTఅసెంబ్లీ రద్దుకు మేం రెడీ..పార్లమెంట్ రద్దుకు మీరు రెడీనా?
27 May 2022 2:15 PM GMTటాలీవుడ్ కు టిక్కెట్ రేట్ల షాక్
27 May 2022 10:30 AM GMTరాష్ట్రం పరువు తీస్తున్న జగన్
27 May 2022 9:33 AM GMTడ్రగ్స్ కేసులో షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్
27 May 2022 8:23 AM GMT
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTకాంగ్రెస్ అంటేనే అన్ని కులాల కలయిక
26 May 2022 7:15 AM GMTమోడీ తెలంగాణ టూర్..టీఆర్ఎస్ వర్సెస్ బిజెపి
26 May 2022 6:55 AM GMTఇక పార్టీ తోకలు తగిలించుకోదలచుకోలేదు
26 May 2022 5:22 AM GMTమీ వైఫల్యాలను మాపై రుద్దకండి
24 May 2022 2:00 PM GMT