‘నాని’ కృష్ణార్జున యుద్ధం సెన్సార్ పూర్తి
BY Telugu Gateway6 April 2018 11:34 AM IST

X
Telugu Gateway6 April 2018 11:34 AM IST
టాలీవుడ్ లో వరస పెట్టి హిట్లు కొడుతున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది హీరో నానినే. ఆయన ఈ వేసవిలో మరోసారి సందడి చేయటానికి రెడీ అయిపోయారు. నాని కొత్త సినిమా ‘కృష్ణార్జున యుద్దం’ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని డ్యూయెల్ రోల్ చేసిన సినిమా ఇది. నానికి జోడీగా అనుపమా పరమేశ్వరన్, రుక్సర్ మీర్ నటించారు.
షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నాని ‘‘యుద్ధం మీ అందరి కోసం సిద్ధం’’ అన్నారు. ‘‘నాని నటనలో మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిదని చిత్ర యూనిట్ చెబుతోంది. కృష్ణ, అర్జున్ పాత్రల లుక్స్ తో పాటు, మూవీ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు నిర్మాతలు.
Next Story



