Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుతో బిజెపి ‘అసలు ఆట’ ఇప్పుడే!

చంద్రబాబుతో బిజెపి ‘అసలు ఆట’ ఇప్పుడే!
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కష్టాలు తప్పవా?. అంటే అవునంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. ఏపీ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నా...దాని కారణంగా తనను ఎక్కడ ‘టచ్’ చేస్తారో అన్న భయంతో చంద్రబాబు ఉన్నారు. అందుకే ఆయన ముందు నుంచే బిజెపి తనపై దాడి చేస్తుందనే ప్రచారాన్ని మొదలుపెట్టారు. తనపై దాడి భయపడి ఇతరులపై దాడి చేయవచ్చనే చంద్రబాబు వ్యాఖ్యల వెనక కూడా ఉద్దేశం అదే అని చెబుతున్నారు. చంద్రబాబు సర్కారు అవినీతికి పక్కా ఆధారాలు ఉన్నా...ఆయనపై కేసు వంటివి పెడితే రాజకీయంగా వీటిని చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకోగల సమర్థుడు. రాష్ట్రం కోసం...ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల కోసం నిత్యం ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ, టెలికాన్ఫరెన్స్ ల, విదేశీ ప్రయాణాలతో కష్టపడుతుంటే నన్ను టార్గెట్ చేశారనే సానుభూతి పొందే ప్రయత్నం చేస్తారని బిజెపికి తెలియదా?.

అందుకే బిజెపి ప్లాన్ మార్చిందని చెబుతున్నారు. పక్కా ఆధారాలతో రాబోయే అతి కొద్ది రోజుల్లోనే కొంత మంది ఐఏఎస్ అధికారులతో పాటు మంత్రులను ‘బుక్’ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.. దీనికి సంబంధించిన కసరత్తు అంతా పూర్తయిందని సమాచారం. సాగునీటి ప్రాజెక్టులు మొదలుకుని విద్యుత్ ప్రాజెక్టులు, అమరావతి, విద్యా శాఖ, మునిసిపల్ శాఖ ఇలా చెప్పుకుంటూ పోతే పలు శాఖల్లో అడ్డగోలుగా ప్రజాధనాన్ని కల్లగొడుతూ ముందుకు సాగుతున్న టీడీపీ సర్కారు బిజెపిని బద్నాం చేయటంపై అటు ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలు గుర్రుగా ఉన్నారు. అందుకే వారిద్దరూ సమయం కోసం వేచిచేస్తూ చంద్రబాబు ఎన్ని ఘాటు..తీవ్ర విమర్శలు చేసినా మౌనంగా ఉంటూ వచ్చారని చెబుతున్నారు.

పక్కా ఆధారాలతో మంత్రులు..అధికారులను బుక్ చేస్తే కక్ష సాధింపు అనటానికి కూడా అవకాశాలు లేని విధంగా ప్లాన్ వర్క్ అవుట్ చేస్తున్నట్లు సమాచారం. ఏ ఒక్క అధికారి ఇరుక్కున్నా మిగిలి ఉన్న ఏడాది కాలంలో ఎవరూ కూడా చంద్రబాబు సర్కారు అక్రమాలకు సహకరించే అవకాశం ఉండదు. ఎందుకంటే గత ప్రభుత్వంలోనూ చాలా మంది అధికారులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అదే బాటలో కొంత మంది పడబోతున్నారు. ఏపీకి అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా అంశాన్ని నాలుగేళ్లు పూర్తిగా వదిలేసి... చివరి బడ్జెట్ లో ఏమీపెట్టలేదంటూ చంద్రబాబు కొత్తరాగం అందుకున్న విషయం తెలిసిందే. స్వయంగా చంద్రబాబే తాను అవినీతి జగన్ ను దగ్గర తీసుకున్నందుకే ఎన్డీయే నుంచి బయటకు వచ్చానని చెప్పిన విషయం తెలిసిందే. అంటే ఆయన కోపం ప్రత్యేక హోదా ఇవ్వనందుకు కాదు..జగన్ కు బిజెపి సపోర్టు చేస్తున్నందుకు అన్న విషయంపై క్లారిటీ వచ్చింది.

Next Story
Share it