Telugu Gateway
Andhra Pradesh

కొత్త చరిత్ర సృష్టించిన మోడీ..చంద్రబాబు

కొత్త చరిత్ర సృష్టించిన మోడీ..చంద్రబాబు
X

ప్రధాని నరేంద్రమోడీ..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు ‘దేశ రాజకీయాల్లో’ కొత్త చరిత్ర సృష్టించారు. ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ విపక్షాలు పార్లమెంట్ సమావేశాలను అడ్డుకున్నాయంటూ దీక్ష చేయగా...ఇప్పుడు చంద్రబాబునాయుడు ‘ప్రభుత్వ ప్రాయోజిత దీక్ష’కు శ్రీకారం చుట్టారు. మోడీ దీక్ష ఎక్కడ జరిగిందో...ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ చంద్రబాబు మాత్రం దీక్షలోనూ ఓ కొత్త రికార్డును సృష్టిస్తున్నారు. ఈ దీక్ష కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయటం ఒకెత్తు అయితే...మొన్న జరిగిన బంద్ పై మన ప్రజలను మనం శిక్షించుకుంటామా? అని నీతి వాక్యాలు చెప్పి...ఇప్పుడు చంద్రబాబు తన దీక్ష కోసం విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టిస్తున్నారు.

ఇది ప్రజలకు అసౌకర్యం కల్పించటం కాదా?. చంద్రబాబు తన కోసం అయితే ఏమైనా చేసుకోవచ్చు. ఇతర పార్టీలు మాత్రం బంద్ లు..ధర్నాలు చేస్తే తప్పు. అయినా దేశంలో ఎక్కడైనా ప్రభుత్వ ప్రాయోజిత దీక్షలు ఉంటాయా?. నిజంగా చంద్రబాబు దీక్ష చేయాలనుకుంటే పార్టీపరంగా అయితే ఒకింత వరకూ ఓకే. కానీ చంద్రబాబు దీక్షకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడటంతో పాటు..స్కూల్ విద్యార్ధులు..ప్రజలను భారీ ఎత్తున తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం ఆర్టీసి బస్సులతోపాటు...ఇతర రవాణా మార్గాలను వాడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా చంద్రబాబు దీక్ష కోసం పనిచేస్తోంది. అంటే రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా ఏవో ఒక కార్యక్రమాలు చేసుకుంటూ ప్రభుత్వ ఖర్చుతో ఉద్యమాలు కొనసాగించే సూచనలు కన్పిస్తున్నాయని చెబుతున్నారు. గతంలో ప్రజా సమస్యలపై కొంత మంది సీఎంలు దీక్షలు చేసినా...చంద్రబాబులా ఈవెంట్ మేనేజ్ మెంట్ లా మాత్రం నిర్వహించలేదు.

Next Story
Share it