‘మహేష్ బాబు’ బహిరంగ సభ

మహేష్ బాబుకి బహిరంగ సభకు సంబంధం ఏమిటి అంటారా?. అవును. నిజమే. మామూలుగా అయితే సినిమాలకు ఆడియో ఫంక్షన్..ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇలా ఉండాలి కానీ...ఇలా బహిరంగ సభ ఎందుకు అనుకుంటున్నారా?. ఎందుకంటే దీనికి ఓ రీజన్ ఉంది. భరత్ అను నేను సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే అంతా పొలిటికల్ కలర్ లోనే లాగించేస్తున్నారు. కొరటాల శివ, మహేశ్ బాబు కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భరత్ అనే నేను సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ ఓత్, పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
అయితే చిత్ర యూనిట్ తాజాగా భరత్ బహిరంగ సభ అంటూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఏప్రిల్ 7న సాయంత్రం 6 గంటలకు ఎల్బీ స్టేడియంలో భరత్ బహిరంగ సభ అంటూ పోస్టర్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ప్రీరిలీజ్ ఈవెంట్‌ను భరత్ బహిరంగ సభ అంటూ రిలీజ్ చేయడం మాత్రం వెరైటీగా ఉంది. ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ కార్యక్రమానికి టాలీవుడ్ టాప్ హీరోలు కొంత మంది అతిధులుగా హాజరయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.