Telugu Gateway
Cinema

‘అచ్చం’ సావిత్రిలాగే!

‘అచ్చం’ సావిత్రిలాగే!
X

కీర్తి సురేష్. అచ్చం సావిత్రిలాగే చేసింది. టీజర్ చూసిన వారెవరైనా ఇదే మాట చెబుతారు. అలనాటి మహానాటిని మరిపించేలా..కీర్తి సురేష్ తన నటనతో మెప్పించటం ఖాయంగా కన్పిస్తోంది. వైజంతీ మూవీస్ ‘మహానటి’ పేరుతో సావిత్రి జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకుడు. మహానటి సినిమాలో పలువురు కీలక నటులు వివిధ పాత్రలు పోషించారు.

ఎస్వీ రంగా రావు పాత్రలో మోహన్ బాబు, అక్కినేని నాగేశ్వరరావుగా నాగచైతన్యలు నటిస్తుండగా...ఇతర ముఖ్య పాత్రల్లో విజయ్ దేవరకొండ, సమంత, షాలినిపాండే, మాళవిక నాయకర్, ప్రకాష్ రాజ్ లు నటిస్తున్నారు. ఈ సినిమా మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే ఒక మిలియన్ వ్యూస్ దక్కించుకుని రికార్డు నెలకొల్పింది.

https://www.youtube.com/watch?v=OrnYMmWBuV4

Next Story
Share it