Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ బయోపిక్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న తేజ

ఎన్టీఆర్ బయోపిక్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న తేజ
X

దర్శకుడు తేజ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నారు. దీంతో ఈ ప్రాజెక్టుపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే కొత్త దర్శకుడితో సినిమా తెరకెక్కిస్తారా? లేక ఏమి చేస్తారన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మధ్యే అత్యంత అట్టహాసంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ కథను ఎక్కడ క్లోజ్ చేయాలనే అంశంలోనే బాలకృష్ణ, తేజల మధ్య వివాదం తలెత్తినట్లు సమాచారం.

దీంతోనే ఆయన సినిమా నుంచి తప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్‌ బయోపిక్‌ను తాను తెరకెక్కించడం లేదని తేజ స్వయంగా వెల్లడించారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ నుంచి తేజ అర్ధాంతరంగా తప్పుకోవడంతో ఈ సినిమాకు బ్రేక్‌ పడిందనే భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతుందా? లేదా అన్న అంశంపై కొన్ని రోజులు గడిస్తే కానీ క్లారిటీ రాదని చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమాలు ఎవరెవరు ఏయే ప్రాత్రలు చేయనున్నారనే అంశంపై పలు రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే తాజా పరిణామంతో వీటికి బ్రేక్ పడినట్లు అయింది.

Next Story
Share it