బన్నీ సెట్ లో ‘సైరా సర్ ప్ర్రైజ్’
అల్లు అర్జున్ సినిమా సెట్ లో మెగా స్టార్ చిరంజీవి సందడి చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘ నా పేరు సూర్య.నా ఇల్లు ఇండియా’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే నెలలోనే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి ఓ పాట షూటింగ్ జరుగుతున్న సమయంలో చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు. అంతే రెచ్చిపోయిన అల్లు అర్జున్ మయా ఊపులో పూర్తి చేశాడని చిత్ర యూనిట్ చెబుతోంది. ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రఫీలో రూపొందుతున్న ‘ఇరగ.. ఇరగ...’ సాంగ్‌లో డ్యాన్స్ ఇరగదీశాడు అల్లు అర్జున్.
వక్కంతం వంశీ దర్శకత్వంలో కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అనూ ఇమ్మాన్యూయేల్ కథానాయిక. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత. ఈ నెల 22న ఆడియో వేడుకను, 29న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను జరపనున్నారు. సినిమాను మే 4న రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.