చంద్రబాబు ఆవిష్కరించిన ‘మోడీ దృష్టి కోణం’!

‘కర్ణాటక ఎన్నికల తర్వాత కేంద్రంలోని పెద్దలు మన మీద దృష్టి పెడతారు. ఎటువంటి సమస్యనైనా, కుట్రనైనా ధైర్యంగా ఎదుర్కొనే నైతికత నాకు ఉంది.’ ఇదీ శనివారం నాడు నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో నిర్వహించిన చేసిన వ్యాఖ్యలు. అంటే తనపై ప్రధాని మోడీ దృష్టి పెట్టదగ్గ అంశాలు ఉన్నాయని చంద్రబాబు అంగీకరిస్తున్నట్లే కదా?. నిజంగా చంద్రబాబు తాను నిత్యం చెప్పుకుంటున్నట్లు నిప్పు...క్లీన్ అయితే మోడీ చంద్రబాబు సర్కారుపై దృష్టి పెట్టి ఏమిచేయగలరు?. అంటే ఎలాంటి తప్పు చేయకపోయినా ప్రధాని మోడీని విభేదించారనే కారణంతో కేసులు పెడతారా?. నిజంగా చంద్రబాబు అంత క్లీన్ గా ఉన్నారా?. అంటే అదంతా భోగస్ అని అధికార వర్గాలే చెబుతున్నాయి. ఏపీలో గతంలో లేని రీతిలో అడ్డగోలుగా అవినీతి సాగుతుందనే విషయాన్ని అధికారులే చెబుతున్నారు. నిజంగా చంద్రబాబు అంత పారదర్శక పాలన చేస్తుంటే సొంత ప్రభుత్వంలోని అధికారులు చెప్పిన అంశాలను కాదని..కేబినెట్ ముందు పెట్టి మరీ అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటారు.
అధికారులు తప్పు అని చెప్పినవి...కేబినెట్ ఓకే అనగానే ఒప్పులు అయిపోతాయా?. చంద్రబాబు సర్కారు అడ్డగోలు నిర్ణయాల జాబితా ఓ చాంతాడు అంత ఉంటుంది. అందుకే..చంద్రబాబుకు తాను ఏమి చేసిందో తెలుసు కనుకే వ్యూహాత్మకంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం..ఐదు కోట్ల ఆంధ్రుల కోసం తాను పోరాడుతుంటే మోడీ తనను వేధించటానికి ప్రయత్నిస్తున్నాడు అనే కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మోడీ గురించి చంద్రబాబుకు అంతకు ముందే ఏమీ తెలియదా?. కాదనే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ రాజకీయ డ్రామా మొదలుపెట్టక ముందు నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఢిల్లీలో కనీసం అపాయింట్ మెంట్ దొరకని రోజులు ఉన్నాయి. ఏపీ ప్రతిపక్ష జగన్ కు అడిగిన వెంటనే అపాయింట్ మెంట్ ఇచ్చి...చంద్రబాబుకుఅపాయింట్ మెంట్ ఇవ్వకపోయినా అప్పుడు బాబుకు ఏమీ బాధ కలగలేదా?.
అంటే అప్పుడు అవసరం ఆయనది కాబట్టి ఆ అవమానాన్ని కూడా ‘మింగేశారు’. రాజకీయ క్లారిటీ వచ్చే కొద్దీ చంద్రబాబు కొత్త ఎత్తువేసి ఏపీ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ ప్రయత్నం లో ఏ మేరకు సఫలం అవుతారో వేచిచూడాల్సిందే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అఖిలపక్షం పిలిస్తేనే కారణాలు ఏవైనా ఒక్కరంటే ఒక్క పార్టీ కూడా హాజరుకాలేదంటే ఆయనపై నమ్మకం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. తన ప్రభుత్వంలోని ఉద్యోగ సంఘాల నాయకులతో కలసి చంద్రబాబు సమావేశం నిర్వహించుకోవాల్సి వచ్చింది. ఇది చాలు ఏపీలో చంద్రబాబు పరపతి ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో చెప్పటానికి.
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTఅసెంబ్లీ రద్దుకు మేం రెడీ..పార్లమెంట్ రద్దుకు మీరు రెడీనా?
27 May 2022 2:15 PM GMTటాలీవుడ్ కు టిక్కెట్ రేట్ల షాక్
27 May 2022 10:30 AM GMTరాష్ట్రం పరువు తీస్తున్న జగన్
27 May 2022 9:33 AM GMTడ్రగ్స్ కేసులో షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్
27 May 2022 8:23 AM GMT
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTకాంగ్రెస్ అంటేనే అన్ని కులాల కలయిక
26 May 2022 7:15 AM GMTమోడీ తెలంగాణ టూర్..టీఆర్ఎస్ వర్సెస్ బిజెపి
26 May 2022 6:55 AM GMTఇక పార్టీ తోకలు తగిలించుకోదలచుకోలేదు
26 May 2022 5:22 AM GMTమీ వైఫల్యాలను మాపై రుద్దకండి
24 May 2022 2:00 PM GMT