చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..టీడీపీ నేతల విస్మయం

తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ సాక్షిగా అసలు విషయం చెప్పేశారు. కేంద్రంలోని ఎన్డీయే నుంచి తాము ఎందుకు బయటికి వచ్చిందీ చంద్రబాబే స్వయంగా వెల్లడించారు. అవేంటో ఆయన మాటల్లోనే...‘ఒక అవినీతి పార్టీని చేరదీసినందుకు బిజెపితో తెగదెంపులు చేసుకున్నాం. ప్రధాని కార్యాలయాన్ని వైసీపీ ఇష్టం వచ్చినట్లు వాడుకుంటోంది. బిజెపితో భవిష్యత్ లో ఎలాంటి సంబంధాలు ఉండబోవు’ అని ప్రకటించారు. కానీ ఇటీవల వరకూ చంద్రబాబు చెప్పింది మాత్రం అందుకు పూర్తి భిన్నం. నాలుగేళ్లు రాష్ట్రానికి బిజెపి న్యాయం చేస్తుందని చూశామని..కానీ చివరి బడ్జెట్ లో కూడా అన్యాయం చేశారని..అందుకే ఇక ఓపిక లేక బయటకు వచ్చామని పదే పదే ప్రకటించారు. ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ ఏమీ అమలు చేయలేదని...సహనంతో ఉన్నా కూడా బిజెపి పట్టించుకోవటం లేదని ఇంత కాలం చెపుతూ వచ్చారు. కానీ దేశ రాజధాని సాక్షిగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఇంత కాలం ఎన్డీయే, బిజెపి రాష్ట్రానికి అన్యాయం చేసింది కాబట్టి తొలుత మంత్రివర్గం నుంచి..తర్వాత ఎన్డీయే నుంచి బయటికి వచ్చామని చెప్పిన చంద్రబాబు అకస్మాత్తుగా బిజెపి అవినీతి పార్టీ వైసీపీని దగ్గరికి చేర్చుకున్నందుకే ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని చెప్పటంపై టీడీపీ నేతలు కూడా షాక్ కు గురయ్యారు. ఈ పరిణామం ఎటుదారితీస్తుందో అన్న టెన్షన్ వారిలో వ్యక్తం అవుతోంది. ఎన్డీయే నుంచి టీడీపీ దూరం అవ్వటానికి కారణం రాజకీయ అంశాలే తప్ప..రాష్ట్ర అంశాలు కాదనే సంగతిని స్వయంగా చంద్రబాబే చెప్పినట్లు అయిందని టీడీపీ నేతల భావిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు మంగళవారం నాడు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో పలు పార్టీల నేతలతో సమావేశం అయిన ఏపీకి జరుగుతున్న అన్యాయంపై వివరించారు. అయితే ఆయన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు మొత్తం చంద్రబాబు పర్యటన లక్ష్యాలను దెబ్బతీశాయని ఓ నేత వ్యాఖ్యానించారు
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTఅసెంబ్లీ రద్దుకు మేం రెడీ..పార్లమెంట్ రద్దుకు మీరు రెడీనా?
27 May 2022 2:15 PM GMTటాలీవుడ్ కు టిక్కెట్ రేట్ల షాక్
27 May 2022 10:30 AM GMTరాష్ట్రం పరువు తీస్తున్న జగన్
27 May 2022 9:33 AM GMTడ్రగ్స్ కేసులో షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్
27 May 2022 8:23 AM GMT
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTకాంగ్రెస్ అంటేనే అన్ని కులాల కలయిక
26 May 2022 7:15 AM GMTమోడీ తెలంగాణ టూర్..టీఆర్ఎస్ వర్సెస్ బిజెపి
26 May 2022 6:55 AM GMTఇక పార్టీ తోకలు తగిలించుకోదలచుకోలేదు
26 May 2022 5:22 AM GMTమీ వైఫల్యాలను మాపై రుద్దకండి
24 May 2022 2:00 PM GMT