చంద్రబాబుదీ...గాలి జనార్ధన్ రెడ్డి మోడలే!
రైతులు భూములిస్తారు...ప్రజలు నిధులిస్తారు..మరి చంద్రబాబు ఏమి చేస్తారు. రాజధాని కాంట్రాక్టులు ఇచ్చి కమిషన్లు తీసుకుంటారా?. సింగపూర్ సంస్థలకు స్విస్ ఛాలెంజ్ కింద ఇచ్చి పెద్ద కుంభకోణానికి తెరతీస్తారా?. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాత్ర అదేనా?. ఏడాదికి తన తనయుడు, మంత్రి నారా లోకేష్ కు వంద కోట్ల రూపాయల లాభం ఆర్జిస్తున్నాడని చెబుతున్నారు కదా?. మరి ఆయన ఏమీ రాజధానికి విరాళం ఇవ్వరా?. చంద్రబాబు ఫ్యామిలీ బాండ్లలో డబ్బులు పెట్టలేరా?. అన్నీ ప్రజలే చేయాలా?. రాజధాని కోసం రైతుల దగ్గర నుంచి 33 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో తీసుకుని....సొంత సంస్థ హెరిటేజ్ కోసం గుట్టుచప్పుడు కాకుండా రాజధాని ప్రకటనకు ముందే 14 ఎకరాలు కొనుగోలు చేసుకుంటారన్న మాట. అన్నీ ప్రజలే చేయాలి. చంద్రబాబు మాత్రం నిత్యం ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ...ఏసీ గదుల్లో సమావేశాలు, టెలికాన్ఫరెన్స్ లు పెట్టుకుంటూ..ప్రజల కోసం..నిత్యం కష్టపడుతున్నట్లు కలరింగ్ ఇస్తారు. రైతులు భూములిచ్చి...రాజధాని నిర్మాణానికి ప్రజలు డబ్బులిస్తే అది చేపట్టానికే చంద్రబాబే కావాలా?. ఎవరైనా ఆ పని చేస్తారు కదా?. ఇది అచ్చం గాలి జనార్థన్ రెడ్డి ఓబుళాపురం గనులను దోచుకున్న తరహాలోనే ఉంది.
వైఎస్ హయాంలోనూ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అవసరమైన భూమి కారుచౌకగా ఇఛ్చి...దానికి అసవరమైన ముడిసరుకు అయిన ఇనుప ఖనిజం గనులు ఇచ్చి..రాయితీలు ఇస్తే గాలి జనార్థన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ పెడతానని అప్పట్లో ముందుకొచ్చారు. అచ్చం ఇప్పుడు చంద్రబాబు అలాగే చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొత్తలో సింగపూర్ సంస్థలే రాజధాని కడతాయని పదే పదే ప్రకటించారు. దేశీయ సంస్థలకు అంతసీన్ లేదని బహిరంగ వ్యాఖ్యలు చేశారు. సీన్ కట్ చేస్తే సింగపూర్ సంస్థలు..చంద్రబాబు కలసి చేసేది ప్రైవేట్ వ్యాపారం. అసలు రాజధాని ప్రజల డబ్బుతో కడతారట చివరకు. కేంద్రం నిధులివ్వకపోయినా రాజధాని కడతానని చంద్రబాబు చెబుతున్న దాంట్లో ఎవరూ ఊహించనంత భారీ స్కామ్ దాగుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
కేంద్రం డబ్బులిస్తే లెక్కలు అడుగుంది. కేంద్రం డబ్బులు ఇవ్వటం లేదని చెప్పి..అంచనాలను అడ్డగోలుగా పెంచి సొంత నిధులతో నిర్మాణాలు చేపడితే..వ్యతిరేకత కేంద్రానికి పోతుంది. దీని వల్ల ఓ వైపు రాజకీయ ప్రయోజనం. మరో వైపు కేంద్ర సహకారం లేకపోయినా రాజధాని కట్టిన ముఖ్యమంత్రిగా క్రెడిట్ కొట్టేసే ప్లాన్. ఇంకో అడ్డగోలుగా దోపిడీ చేసుకునే వెసులుబాటు. రాజధానికి అసలు కేంద్రం ఎందుకు నిధులు ఇవ్వదు? ఇది ఏమైనా అటు మోడీ..ఇటు చంద్రబాబు సొంత ఇంటి వ్యవహారమా?. విభజన చట్టంలో ఉంది కదా?. చట్టంలో లేని ప్రత్యేక హోదా కోసం పోరాడే చంద్రబాబు...విభజన చట్టంలో ఉన్న రాజధాని నిధుల కోసం ఎందుకు పోరాడరు?. ఇచ్చిన నిధులను డైవర్ట్ చేశారు. చట్టంలో ఉన్న అంశాలపై కోర్టులను ఆశ్రయించొచ్చు. కానీ అది చేయకుండా ఎంతసేపు రాజకీయ, స్వప్రయోజనాల కోసం తపించటం తప్ప...చంద్రబాబు ఏపీ ప్రజలకు ఒరగబెడుతుంది ఏమీలేదనే చెప్పొచ్చని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు.