Telugu Gateway
Andhra Pradesh

కెమెరామెన్ గంగతో రాంబాబు...పవన్ పాత్ర మారింది

కెమెరామెన్ గంగతో రాంబాబు...పవన్ పాత్ర మారింది
X

కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా గుర్తుందా?. అందులో పవన్ కళ్యాణ్ మీడియా ప్రతినిధిగా ఉంటారు. అందులో రాజకీయ నాయకులు..మీడియా మధ్య జరిగే వ్యవహారాలను చాలా చక్కగా తెరకెక్కించారు. ఈ సినిమా కూడా విశేష ఆదరణ పొందింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అచ్చం అదే తరహాలో ట్వీట్ లు చేస్తున్నారు. అయితే ఈ సారి పవన్ కళ్యాణ్ పాత్ర మారింది. సీన్ రివర్స్ అయింది. రాజకీయ నేతగా మారిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరస పెట్టి ఎంపిక చేసిన మీడియా మీద ఎటాక్ ప్రారంభించారు. దీనికి ఆయన ట్విట్టర్ వేదికను ఎంచుకున్నారు. శనివారం నాడు కూడా పవన్ తన ట్వీట్ల పరంపరను కొనసాగించారు. ‘నిజమైన అజ్ఞాతవాసి’ ఎవరో మీకు తెలుసా? అంటూ ట్వీట్‌ చేశారు. ‘నాకు ఇష్టమైన స్లోగన్ ‘ఫ్యాక్షనిస్టుల ఆస్తలును జాతీయం చెయ్యాలి’. అనే నినాదం. అసలు ఈ స్లోగన్ వెనకాల కథకి ఈ స్లోగన్ కి సంబంధం ఏంటి?’ అని మరో ట్వీట్‌లో ప్రశ్నించారు.

‘స్టే ట్యూన్డ్ .. లైవ్‌ ఫ్రమ్‌ హైదరాబాద్‌.. నిజాలని నిగ్గు తేలుద్దాం ప్రోగ్రాం నుంచి మీ పవన్‌ కళ్యాణ్‌’ అంటూ పేర్కొన్నారు. ‘ఈ ‘అజ్ఞాతవాసిని ‘వాడో బ్లాక్‌మెయిలర్‌’ అని.. స్వయానా ముఖ్యమంత్రి అన్నారని ఒక రాష్ట్ర కేబినెట్ ర్యాంక్ మంత్రి “ఒకరి”తో అన్నారు. ఆ మంత్రి ఎవరు, ఆ ముఖ్యమంత్రి ఎవరు, ‘ఒకరు’ ఎవరు... తెలుసుకోవాలనివుందా.. స్టే ట్యూన్‌డ్‌ టు “బట్టలు విప్పి మాట్లాడుకుందాం” ప్రోగ్రాం నుంచి - పవన్‌ కల్యాణ్‌ విత్‌ కెమెరామ్యాన్‌ ట్విటర్‌’ అని పోస్టు చేశారు. ఫ్యాక్షనిస్టుల ఆస్తులు స్వాధీనం చేసుకోవాలనే నినాదం టివీ9 ఛానల్ ప్రత్యేకం అన్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా పవన్ మీడియాపై విరుచుకుపడుతున్నారు. ఏకంగా టీవీ9, టీవీ5, ఏబీఎన్ ఛానళ్ళను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

Next Story
Share it