టీవీ9, టీవీ5,ఏబీఎన్ ల బాయ్ కాట్ కు పవన్ పిలుపు
BY Telugu Gateway20 April 2018 7:56 PM IST

X
Telugu Gateway20 April 2018 7:56 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాపై పోరాటం మొదలపెట్టారు. ముఖ్యంగా కొన్ని చానెళ్ళ విషయంలో ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి అదే పనిలో ఉన్నారు. కొన్ని ఛానళ్ళను అడ్డం పెట్టుకుని ఏపీ మంత్రి నారా లోకేష్ తనపై రాజకీయ కుట్ర చేశారని ఆరోపించి ఒక్కసారిగా కలకలం రేపారు. శుక్రసాయం సాయంత్రం టీవీ9, టీవీ5, ఏబీఎన్ ఛానళ్ళను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. మన తల్లులు. కూతుళ్ళు, సోదరులను దూషిస్తున్న ఈ ఛానళ్ళను బహిష్కరించాలి కోరారు. ఓ నిస్సహాయ సోదరి నగ్నత్వంతో వ్యాపారం చేసే, దూషణలతో వ్యాపారం చేసే వారికి ఇదే సరైన చర్య అని పేర్కొన్నారు.
Next Story