Telugu Gateway
Cinema

‘భరత్ అనే నేను’ ట్రైలర్ అదిరింది

‘భరత్ అనే నేను’ ట్రైలర్ అదిరింది
X

మహేష్ బాబు కొత్త సినిమా ‘భరత్ అనే నేను’ సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా రాజకీయ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కతున్న ఈ సినిమా ట్రైలర్ లోనే రాజకీయ డైలాగులు అదరగొట్టేలా ఉన్నాయి. అయితే హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. తొలిసారి బాలీవుడ్ బామ కైరా అద్వానీ ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా నటించింది.

దర్శకుడు కొరటాల తన ప్రతి సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తోపాటు ఒక సామాజిక సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. భరత్ అను నేను ప్రస్తుత రాజకీయాలను టార్గెట్ చేసినట్లు కన్పిస్తోంది. ముఖ్యంగా రాజకీయ నేతలు మాట ఇచ్చి తప్పకూడదనే చెప్పే డైలాగులు కూడా ఇందులో ఉన్నాయి. ఈ సినిమాకు డీ వీ వీ దానయ్య నిర్మాతగా ఉన్నారు.జర్నీ ఆఫ్ భరత్ పేరుతో ఈ ట్రైలర్ ను విడుదల చేశారు.

https://www.youtube.com/watch?v=KMWS5y2gZ6E

Next Story
Share it