‘వచ్చాడయ్యో సామీ’ సాంగ్ విడుదల
మహేష్ బాబు, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భరత్ అను నేను’ సినిమా షూటింగ్ గురువారంతో పూర్తయింది. ఇక సెన్సార్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావటమే ఆలశ్యం. ఏప్రిల్ 20న సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇఫ్పటికే రెండు పాటలను విడుదల చేసిన చిత్ర యూనిట్ ..కొత్తగా గురువారం నాడు వచ్చాడయ్యో స్వామి పాటను విడుదల చేసింది. ఇంతకు ముందు విడుదల చేసిన రెండు పాటల కంటే ఈ పాట మహేష్ బాబు అభిమానులను ఆకట్టుకోవటం ఖాయంగా కన్పిస్తోంది. రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం.. దానికి కైలాష్‌కేర్, దివ్య కుమార్‌లు అందించిన గాత్రం ఆకట్టుకునేలా ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు తనదైన బీట్‌ను అందించేశాడు.
పంచెకట్టులో ముఖ్యమంత్రి భరత్ ప్రజలతో కలిసి చిందులేసే నేపథ్యంలో స్టిల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. పొలిటికల్ కమర్షియల్ డ్రామాగా కొరటాల శివ భరత్ అనే నేనును తెరకెక్కించాడు. కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఏప్రిల్ 7న చిత్ర ఆడియోను హైదరాబాద్ లో భరత్ బహిరంగ సభ పేరిట విడుదల చేయనున్నారు.
https://www.youtube.com/watch?v=6YkK1fTSzss