పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు
BY Telugu Gateway26 April 2018 9:12 AM GMT
X
Telugu Gateway26 April 2018 9:12 AM GMT
జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ పై బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. టీవీ9 ఛానల్ పై తప్పుడు ప్రచారం చేశారంటూ జర్నలిస్టు సంఘాలు ఫిర్యాదు చేశాయి. అదే సమయంలో టీవీ9లో ప్రసారం కాని వీడియోలను ట్విట్టర్ లో పోస్టు అసత్య ప్రచారం చేశారని, టీవీ9 విశ్వసనీయ దెబ్బతీసినందుకు కేసు నమోదు చేశారు.
పవన్ పై పోలీసులు ఐపీసీలోని 469, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ మీడియాపై ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి డైరక్షన్ లో కొన్ని ఛానళ్ళు సాగుతున్నాయని ఆయన ఆరోపించారు.
Next Story