అల్లు అర్జున్ ‘రాజకీయ డైలాగులు’

అల్లు అర్జున్ తన కొత్త సినిమా ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’లో రాజకీయ డైలాగులు చెప్పారా?. ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన డైలాగ్ ఇంప్యాక్ట్ లో మాత్రం రాజకీయ కోణం చూపిస్తోంది. ఓ ఫైట్ సీన్ లో అల్లు అర్జున్ ను ‘‘సౌత్ ఇండియాకా సాలా’ అంటూ దూషిస్తాడు విలన్. ఈ తరుణంలో అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ ఆసక్తికరంగా మారింది. సౌత్ ఇండియా. నార్త్ ఇండియా. ఈస్ట్, వెస్ట్ అన్ని ఇండియాలు లేవురా మనకి అని అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొంత కాలంగా రాజకీయాల్లో దక్షిణ భారత దేశాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాల ఫోకస్ అంతా ఉత్తర భారతదేశంపైనే ఉంటుందని..తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కొద్ది రోజుల దక్షిణ భారతదేశం,,ఉత్తర దేశం అనే విభేదాలు రాకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. గత కొద్ది రోజులుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఈ దక్షిణ, ఉత్తర భారత అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఈ తరుణంలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగులు ఆసక్తికరంగా మారాయి. నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా సినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ అధికారిగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మే 4న విడుదల కానుంది.
https://www.youtube.com/watch?v=YEG--MhFPuc
తెలంగాణ బిజెపికి టీఆర్ఎస్ షాక్
30 Jun 2022 3:16 PM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTహైదరాబాద్ లో అమ్ముడుపోని ఇళ్ళ యూనిట్లు 82,220
30 Jun 2022 7:40 AM GMT
ఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMTరాజీనామాకు రెడీ..పదవుల కోసం పాకులాడను
22 Jun 2022 2:28 PM GMT