అను ఇమాన్యుయల్ తో అల్లు అర్జున్ సెల్ఫీ

‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాను మే4న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ పూర్తయిన విషయాన్ని అల్లు అర్జునే స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే కాదు..తన హీరోయిన్ అను ఇమాన్యుయల్ అడిగిన తొలి సెల్ఫీకి ఓకే చెప్పినట్లు కూడా ట్వీట్ చేశాడు ఈ హీరో. ఇది తొలి వ్యక్తిగత ఫోటో ఆ హీరోయిన్ తో అని పేర్కొన్నారు. వక్కంతం వంశీ ఈ సినిమా దర్శకుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు.
ఈ సినిమాలో సైనికుడిగా కనిపించేందుకు బన్నీ తన లుక్‌ను పూర్తిగా మార్చేసుకున్నాడు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ శేఖర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను లగడపాటి శ్రీధర్, నాగబాబులు నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా కూడా ఏప్రిల్ లోనే విడుదల కావాల్సి ఉంది. అయితే భరత్ అనే నేను సినిమాతో క్లాష్ కావటంతో ఇరు చిత్రాల నిర్మాతలు చర్చించుకుని..తేదీలు సర్దుబాటు చేసుకున్నారు. దీంతో ముందు భరత్ అనే నేను విడుదల అవుతుంది. నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమా మేలో సందడి చేయనుంది.
నాలుగేళ్ల తర్వాత పారిశ్రామికవేత్తలకు కాపలా కాయాలా?
27 Jun 2022 12:45 PM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMTబిజెపి నిరంకుశ తీరుకు వ్యతిరేకంగానే...కెటీఆర్
27 Jun 2022 11:58 AM GMTటీచర్ల ఆస్తుల దగ్గర మొదలై..కెసీఆర్ ఆస్తుల వరకూ...
25 Jun 2022 4:06 PM GMTఅమ్మకానికి అమరావతి భూములు
25 Jun 2022 2:06 PM GMT
సంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMTరాజీనామాకు రెడీ..పదవుల కోసం పాకులాడను
22 Jun 2022 2:28 PM GMT'మహా' ట్రబుల్ షురూ
21 Jun 2022 5:51 AM GMTఅసలు మోడీ తల్లి వయస్సు ఎంత?
20 Jun 2022 3:43 PM GMTమోడీ సర్కారు ఆరోపణల విముక్తి పథకం
20 Jun 2022 12:10 PM GMT