ఏపీలోనూ ఓటుకు నోటు కేసు!
ఏపీ రాజకీయాల్లో మరో భారీ కుదుపు. తెలంగాణలో ఓటు నోటుకేసు పెనుదుమారం రేపగా...ఇప్పుడు అదే తరహా వ్యవహారం ఏపీలో చోటుచేసుకుంది. రాజ్యసభ ఎన్నికల్లోటీడీపీ మూడవ అభ్యర్థికి ఓటు వేయించేందుకు ఓ మంత్రి ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగించారు. అది కాస్తా వారు రికార్డు చేశారు. ఇప్పుడు ఈ అంశం ఏపీలో పెద్దహాట్ టాపి గా మారింది. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి ఒకరు ఈ బేరసారాలు సాగించారు. మూడవ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన బలం లేకపోయినా కూడా టీడీపీ ముగ్గురిని బరిలో దింపాలని ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా సాధ్యమైనంత మేర వలసలను ప్రోత్సహిస్తోంది. దీనికోసం భారీ ఎత్తున బేరసారాలు సాగిస్తోంది. ఓ వైపు కేంద్రం నుంచి ప్రత్యేక హోదా, రైల్వేజోన్, ఇతర న్యాయమైన సాయం పొందటంలో విఫలమైన టీడీపీ ఇప్పుడు ఎమ్మెల్యేలతో బేరాలు సాగిస్తూ దొరకటం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది. ఏపీకి చెందిన మంత్రి సాగించిన ఈ బేరసారాల ఆడియో టేప్ ల ను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసేందుకు వైసీపీ రెడీ అయింది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లోఉన్న టీడీపీకి ఈ వ్యవహారంమరో పెద్ద తలనొప్పిగా మారింది.
అయితే సదరు మంత్రి పార్టీ అధినేత ఆదేశాలు లేకుండానే అలాచేస్తారా? అన్న అనుమానం తలెత్తుతోంది. స్వయంగా మంత్రి ఇలా ఇద్దరు అపొజిషన్ ఎమ్మెల్యేలను తేవటం వల్ల ఆయనకు పెద్దగా ఉపయోగం ఉండదని..ఇది పెద్దల ఆదేశాలతో జరిగి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు తర్వాత ఈ వ్యవహారంమరింత వేడి రాజేయటం ఖాయంగా కన్పిస్తోంది. సీఎం పేషీలోని కొంత మంది అధికారులే ఎమ్మెల్యేల బేరసారాలకు పాల్పడుతున్నారని కొద్ది రోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. దీన్ని బలపర్చేలా మంత్రి ఆదినారాయణరెడ్డి అవినీతి సొమ్ము సెటిల్ మెంట్ లో సీఎం చంద్రబాబు ఇద్దరు ఐఏఎస్ ల తో కూర్చో పెట్టి సెటిల్ చేశారని చెప్పటం పెద్ద దుమారమే రేపుతోంది. ఈ వ్యవహారాలు అన్నీ చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నత విలువలను పతాకస్థాయికి తీసుకెళుతున్నట్లు కన్పిస్తోంది.