Telugu Gateway
Cinema

విజయ్ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’ ఫస్ట్ గేర్

విజయ్ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’ ఫస్ట్ గేర్
X

అర్జున్ రెడ్డి సినిమాతో టాప్ గేర్ లోకి వెళ్లిపోయిన హీరో విజయ్ దేవరకొండ ఆ స్పీడ్ కొనసాగించగలరా?. హీరోగా చేసిన సినిమాలు పెళ్ళిచూపులు..అర్జున్ రెడ్డి ఈ కుర్రహీరోకు టాలీవుడ్ లో క్రేజ్ ను ఒక్కసారిగా పెంచేశాయి. అయితే అర్జున్ రెడ్డి తర్వాత మధ్యలో వచ్చిన సినిమా ఏ మంత్రం వేశావే బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చింది. ఈ సినిమాలో విజయ్ యాక్షన్ బాగానే ఉన్నా...సినిమా అత్యంత నాసిరకంగా ఉండటంతో ఇది ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

ఈ వేసవిలో విజయ్ ‘ట్యాక్సీవాలా’గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. త్వరలోనే ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన మాళవిక నాయర్, ప్రియాంక జ్వల్కర్ లు నటిస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్ కావటంతో విజయ్ కు వరస పెట్టి అవకాశాలు వస్తున్నాయి.

https://www.youtube.com/watch?v=jqg34OpWu1Y

Next Story
Share it