విజయ్ ‘నోటా’ ఫస్ట్ లుక్ విడుదల
BY Telugu Gateway8 March 2018 4:51 PM GMT

X
Telugu Gateway8 March 2018 4:51 PM GMT
అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో ఇమేజ్ దక్కించుకున్నాడు విజయ్ దేవరకొండ. విజయ్ హీరోగా నటించిన పెళ్లిచూపులు సినిమా కూడా సూపర్ హిట్ అయినా కూడా అర్జున్ రెడ్డి సినిమా మాత్రం విజయ్ కు మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. రాజకీయాల నేపథ్యంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పేరును ‘నోటా’గా ప్రకటించారు. అంతే కాదు..ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఇందలో విజయ్ మధ్య వేలుకు ఉన్న చుక్కను చూపిస్తూ..సీరియస్ లుక్ తో కన్పిస్తారు. సమకాలీన రాజకీయాలు.. పొలిటికల్ లీడర్ అయిన హీరో తండ్రి, తన కొడుకును ఏ విధంగా రాజకీయాల్లోకి లాగాడు అన్నదే చిత్ర ప్రధానాంశాలుగా ఉండబోతున్నాయని చెబుతున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కుతోంది. మెహ్రీన్ ఈ సినిమాలో విజయ్ కు జోడీ కడుతోంది.
Next Story