Telugu Gateway
Andhra Pradesh

నాకు డబ్బుల కోసం దిగజారాల్సిన పనిలేదు: తిరుమలరావు చమెళ్ళ

‘లోకేష్ శాఖలో కళ్ళుతిరిగే కుంభకోణం’..తిరుమలరావు చమిళ్ళదే కుంభకోణంలో కీలక పాత్ర అంటూ తెలుగుగేట్ వే. కామ్ లో ప్రచురించిన వార్తకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి ఏజెన్సీ సీఈవో తిరుమలరావు వివరణ ఇచ్చారు. డబ్బుల కోసం దిగజారాల్సిన అవసరం తనకు లేదని..కార్పొరేట్ రంగంలో పనిచేసినప్పుడే తాను ఎంతో సంపాదించుకున్నానని..రాష్ట్రానికి సేవచేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వంలో చేరినట్లు తెలిపారు. తనకు ఉన్న నైపుణ్యంతో డబ్బు సంపాదించుకుంటానే తప్ప..తప్పులు చేయాల్సిన అవసరం తనకులేదని తెలిపారు. నిజాయతీగా ఉంటూ...రాత్రిళ్ళు హాయిగా నిద్రపోవటానికే ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వైజాగ్ లో 70 మిలియన్ అమెరికా డాలర్లు పెట్టుబడి పెట్టటానికి ముందుకొచ్చిందని తెలిపారు. జీవోలో ఆ విషయం ప్రస్తావించకపోవటం తనకు తెలియదన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే వైజాగ్ లోని రుషికొండలో ఎకరా మార్కెట్ పది కోట్ల రూపాయలపైనే ఉంది. ఈ లెక్కన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇన్నోవా సొల్యూషన్స్ పెట్టుబడి 450 కోట్ల రూపాయలు ఉంటే..భూమితో పాటు సర్కారు కల్పించే రాయితీలు అన్నీ చూస్తే 500 కోట్ల రూపాయలు దాటుతున్నాయి. అయితే అయితే మార్కెట్ రేటు ఎలా ఉన్నా ఏపీఐఐసీ నిర్దారించిన రేట్లనే అందరికీ వర్తింపచేస్తామని తెలిపారు.

Next Story
Share it