Top
Telugu Gateway

తమన్నా చెప్పిన సీక్రెట్

తమన్నా చెప్పిన సీక్రెట్
X

ఆమె టాలీవుడ్ లోకి ప్రవేశించి దశాబ్దం దాటింది కూడా. వచ్చినప్పుడు ఎలా ఉందో..ఇప్పుడూ అలాగే ఉంది. ఫిజిక్ లో ఏ మాత్రం మార్పు లేకుండా ఎన్నో జాగ్రత్తలు. అందుకే ఆమె కుర్రకారుకు కలల రాణి అయింది. తమన్నాను అందరూ మిల్కీ బ్యూటీగా పిలిచే విషయం తెలిసిందే. అలాంటి తమన్నా ఇప్పుడు అసలు విషయం చెప్పేసింది. అదేంటో తెలుసా?. తన స్లిమ్ రహస్యం. వింటే ఆశ్చర్యపోతారు కానీ..అదే నిజం అని చెబుతోంది ఈ భామ. అదేంటో మీరూ ఓ సారి చూడండి. కప్పు కాఫీనే తన ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెబుతోంది తమన్నా.

అయితే ఇది రొటీన్ కాఫీ మాత్రం కాదు సుమా. బటర్‌ కాఫీ అట. ఈ బటర్‌ కాఫీ ఏమిటి అని ప్రశ్నించగా ఇదే తన ఆరోగ్య రహస్యం అని చెప్పారు. కాఫీలో బటర్‌ మిక్స్‌ చేసి తాగితే కొవ్వుమొత్తం కరిగి పోతుందని, హృదయానికి మంచిదని, రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుందని చెబుతోంది. తన రోజును బటర్‌ కాఫీతోనే ప్రారంభిస్తానంటూ తమన్నా తన రహస్యం బహిర్గతం చేశారు.

Next Story
Share it