Telugu Gateway
Cinema

అదిరేలా ‘సవ్యసాచి’ ఫస్ట్ లుక్

అదిరేలా ‘సవ్యసాచి’ ఫస్ట్ లుక్
X

అక్కినేని నాగచైతన్య కొత్త సినిమా ‘సవ్యసాచి’. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ శుక్రవారం నాడు విడుదలైంది. ఇది నాగచైతన్య అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మహాభారతంలో అర్జునుడి అయిదో పేరు సవ్యసాచి. ఎందుకంటే అర్జునుడు రెండు చేతులతో ఒకే వేగంతో విలువిద్య ప్రదర్శించగలడు. అలాగే ఈ చిత్రంలో హీరో రెండు చేతులను సమర్థవంతంగా వాడి పరిస్థితులను, ప్రత్యర్థులను ఎదుర్కొంటాడు అంటూ ఓ సందేశంతో పోస్టర్‌ను వదిలారు.

బ్యాక్‌ గ్రౌండ్‌లో చేతులు.. వాటిపై రాసి ఉన్న అక్షరాలు... డిఫరెంట్ లుక్ లో నాగచైతన్య. మైత్రి మూమీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని చందూ మొండేటి డైరెక్ట్‌ చేస్తుండగా.. నాగ చైతన్య సరసన నిధి అగర్వాల్‌ నటిస్తోంది. కీరవాణి మ్యూజిక్‌ అందిస్తుండగా.. మాధవన్‌, భూమికలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Next Story
Share it