సమంత..నాగచైతన్య జోడీగా సినిమా
BY Telugu Gateway8 March 2018 6:06 AM GMT

X
Telugu Gateway8 March 2018 6:06 AM GMT
నిజం. అక్కినేని నాగచైతన్య, సమంత జోడీగా సినిమా ఖరారైంది. ఇదేమి ప్రచారం కాదు. అఫీషియల్ న్యూస్. గతంలో ఇలాంటి ప్రచారం జరిగినప్పుడు ఖండించిన ఈ జంట ఇప్పుడు ఔను.నిజమే అని తేల్చిచెప్పింది. తన భార్యతో కలసి నటిస్తున్నట్లు నాగచైతన్య తెలిపారు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ‘నా భార్య అవకాశం ఇస్తే ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకుంటా’ అంటూ చైతన్య ట్వీట్ చేశారు.
దీనికి రియాక్ట్ అయిన సమంత ఎగ్జైటెడ్..ఎగ్జైటెడ్ అంటూ స్పందించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమాను సాహు గరిపాటి, హరీష్ పెద్ది నిర్మాతలు వ్యవహరించనున్నారు. పెళ్ళి తర్వాత నాగచైతన్య, సమంతలు కలసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే. దీంతో ఈ సినిమాపై సమంత, నాగచైతన్య అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT