‘నేల టిక్కెట్ ’ ఫస్ట్ లుక్
ఉగాదికి టాలీవుడ్ లో భారీ ఎత్తున సందడి నెలకొంది. కొంత మంది హీరోలు కొత్త సినిమాలు అనౌన్స్ చేస్తే..మరికొంత మంది ఇప్పటికే ప్రారంభం అయిన చిత్రాలకు సంబంధించిన వివరాలు షేర్ చేసుకున్నారు. అందులో భాగంగానే మాస్ మహారాజా రవితేజకు సంబంధించిన నేలటిక్కెట్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయింది. ప్రచారంలో ఉన్న టైటిల్ నే సినిమాకు ఖరారు చేశారు. ఈ సినిమాలో రవితేజకు జోడీగా మాళవిక నాయర్ నటిస్తోంది. ఉగాది పచ్చడిలోని విభిన్న రుచుల మాదిరి సినిమాలో ఆల్ ఎమోషన్స్ గ్యారంటీ.
ఏడాది పిల్లల నుంచి అందరూ ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను చూసి ఫుల్‌గా ఎంటర్‌టైన్ అవుతారని చిత్రబృందం చెబుతోంది. కానీ ఫస్ట్ లుక్‌లో టిక్కెట్ ఖరీదు పది రూపాయాలు అని ఉంది. టిక్కెట్ నంబర్ ఏమో 420 అని ఉంది. మరి.. ఈ 420 బ్యాగ్రౌండ్ ఏంటో తెలియాలంటే ఆడియన్స్ థియేటర్స్‌కి వెళ్లాల్సిందే. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తి అయింది. ఈ చిత్రాన్ని మే 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ లో రవితేజ ఫుల్ జోష్ లో కొంత మంది మహిళలతో కలసి చాయ్ తాగుతున్న దృశ్యం చూడొచ్చు.