Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

వర్మ డైరక్షన్ లో ‘అక్కినేని అఖిల్’

0

అక్కినేని అఖిల్ వరస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. సరైన హిట్ కోసం తపిస్తున్నాడు. చేసిన రెండు సినిమాలు అఖిల్, హలోలు ఆశించిన స్థాయిలో విజయాలను అందించలేకపోయాయి. ఇప్పటికే మూడవ సినిమాకు కమిట్ అయిపోయిన అఖిల్…నాల్గవ సినిమాకు కూడా ఓకే  చెప్పేశాడు. అదీ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కావటం విశేషం. అక్కినేని నాగార్జునతో వర్మ తాజాగా ఆఫీసర్ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇది మేలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతలోనే అఖిల్ సినిమాను అధికారికంగా ప్రకటించేశాడు.

- Advertisement -

అఖిల్ మూడవ సినిమా వెంకీ అట్లూరితో చేయనున్నాడు. ఇటీవల లాంచనంగా ఈ సినిమాను ప్రారంభించారు. నాగార్జున సొంత నిర్మాణ సంస్థలో అఖిల్‌ హీరోగా సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు వర్మ. శివ సినిమా తరువాత అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇదే కావటం విశేషం. ఈ సినిమాను యాక్షన్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కిస్తున్నట్టుగా తెలిపారు. శివ సినిమా సమయంలో నాగార్జున కన్నా అఖిల్‌కు మంచి వాయిస్‌, మంచి స్టైల్‌ ఉందని అఖిల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు  వర్మ.  చూడాలి మరి ఈ కాంబినేషన్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో.

 

 

 

Leave A Reply

Your email address will not be published.