Telugu Gateway
Cinema

మళ్ళీ జోడీకడుతున్న అనుపమ..రామ్

మళ్ళీ జోడీకడుతున్న అనుపమ..రామ్
X

రామ్ హీరోగా కొత్త సినిమా మొదలైంది. ఈ సినిమాకు ఆసక్తికరంగా ‘హలో గురు ప్రేమ కోసమే’ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో రామ్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించనున్నారు. వీరిద్దరూ కలసి ఇప్పటికే ‘ఉన్నది ఒక్కటే జిందగీ’లో నటించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త సినిమాకు త్రినాథ్ నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు.

గత కొంత కాలంగా టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలైంది. సూపర్ హిట్ అయిన సినిమాల్లోని పాటలకు చెందిన చరణాలే సినిమా టైటిల్స్ గా మారుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు రామ్ కొత్త సినిమాకు కూడా అదే తరహాలో ఓ పాటలోని చరణాలనే టైటిల్ గా ఫిక్స్ చేశారు. ఈ కొత్త సినిమా షూటింగ్ గురువారం నాడు మొదలైంది.

Next Story
Share it