ఏపీ పొలిటికల్ ఫీల్డ్ లోకి రామ్ మాధవ్

బిజెపి స్పీడ్ పెంచింది. ముఖ్యంగా ఏపీలో పరిణామాలకు అనుగుణంగా చకచకా అడుగులు వేస్తోంది. బిజెపితో టీడీపీ పొత్తును తెంచుకున్న వెంటనే ఏపీకి సంబంధించి ‘ప్రత్యేక ప్లాన్ ’ రెడీ చేసుకుంటోంది. అందులో భాగంగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కు ఏపీ బిజెపి వ్యవహారాల బాధ్యతను అప్పగించింది. ఏపీ బిజెపి నేతలు శనివారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో భేటీ అయిన సందర్భంలో ఈ నిర్ణయం వెలువడింది. అమిత్ షాతో జరిగిన ఈ భేటీలో ఏపీ నేతలు రాం మాధవ్, పురందేశ్వరీ, హరిబాబు, కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాల రావు, సతీష్ జీ, విష్ణుకుమార్ రాజు, సోము వీర్రాజు, ఆకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. . ఏపీలో బీజేపీ అనుసరించాల్సిన వ్యూహం, టీడీపీని ఎలా ఎదుర్కోవాలి? బీజేపీపై, కేంద్రంపై విమర్శలు చేస్తున్న ఇతర పార్టీలపై ఎలాంటి వైఖరి అనుసరించాలనే దానిపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు చంద్రబాబు సిద్ధపడటంతో ఇక ఆ పార్టీ విషయంలో దూకుడుగా ముందుకువెళ్లాలని, చంద్రబాబు పరిపాలనలోని అవకతవకలను టార్గెట్ చేయాలని బీజేపీ ఏపీ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు అందించినట్లు సమాచారం. అదే సమయంలో ఏపీ నుంచి కేంద్ర మంత్రి పదవి ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న హరిబాబుకు దక్కే అవకాశం ఉందని..ఆయన స్థానంలో దూకుడుగా ఉండే కొత్త నేతకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి బిజెపి ప్రయత్నాలు ఏపీలో ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాల్సిందే.
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTఅసెంబ్లీ రద్దుకు మేం రెడీ..పార్లమెంట్ రద్దుకు మీరు రెడీనా?
27 May 2022 2:15 PM GMTటాలీవుడ్ కు టిక్కెట్ రేట్ల షాక్
27 May 2022 10:30 AM GMTరాష్ట్రం పరువు తీస్తున్న జగన్
27 May 2022 9:33 AM GMTడ్రగ్స్ కేసులో షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్
27 May 2022 8:23 AM GMT
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTకాంగ్రెస్ అంటేనే అన్ని కులాల కలయిక
26 May 2022 7:15 AM GMTమోడీ తెలంగాణ టూర్..టీఆర్ఎస్ వర్సెస్ బిజెపి
26 May 2022 6:55 AM GMTఇక పార్టీ తోకలు తగిలించుకోదలచుకోలేదు
26 May 2022 5:22 AM GMTమీ వైఫల్యాలను మాపై రుద్దకండి
24 May 2022 2:00 PM GMT