Telugu Gateway
Cinema

కొత్త లుక్ లో రామ్ చరణ్

కొత్త లుక్ లో రామ్ చరణ్
X

ఓ వైపు రంగస్థలం సినిమా విడుదలకు సిద్ధం అవుతుండగా.. ఈ మెగా హీరో మరో సినిమా పనుల స్పీడ్ పెంచాడు. ఈ కొత్త సినిమాకు సంబంధించిన న్యూలుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మంగళవారం నాడు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ లుక్ విడుదల చేశారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను బోయపాటి పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండగా మరోసారి దేవీ ప్రసాద్‌ చరణ్ సినిమాకు సంగీతమందిస్తున్నాడు. బోయపాటి మార్క్‌ యాక్షన్‌ ఎలిమెంట్స్‌ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.

Next Story
Share it