రామ్ చరణ్ రచ్చ మొదలైంది

మెగా హీరో రామ్ చరణ్ సందడి ప్రారంభం అయింది. వరస పెట్టి పాటలు విడుదల చేస్తూ రచ్చ చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రమే మరో పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రంగా.. రంగా... రంగస్థలానా రంగుపూసుకోకున్నా... అంటూ సాగే మాస్ బీట్తో కూడిన పాట ఇది. చంద్రబోస్ రాసిన సాహిత్యం.. రాహుల్ సిప్లిగంజ్ గాత్రం... అందుకు దేవీశ్రీప్రసాద్ అందించిన బాణీ ఆకట్టుకుంటున్నాయి. వినబడేట్లు కాదు రా.. కనబడేట్లు కొట్టండహే అంటూ చెర్రీ వాయిస్ ఓవర్ తో ఊర మాస్ బీట్ సాంగ్‌ను దేవీ అందించాడు.
సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. హీరోయిన్గా సమంత, కీలక పాత్రల్లో ఆది, అనసూయ తదితరులు నటించగా.. పూజా హెగ్డే ఐటెం సాంగ్‌లో కనిపించనుంది. మార్చి 30న రంగస్థలం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటివానిగా నటిస్తున్న విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో 1985 నాటి పరిస్థితులను తలపిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
https://www.youtube.com/watch?v=-vsV5N4fGvM