Telugu Gateway
Cinema

రాజ్ తరుణ్ సందడి మే 11న

రాజ్ తరుణ్ సందడి మే 11న
X

యువ హీరో రాజ్ తరుణ్ ఈ సమ్మర్ లో సందడి చేయటానికి రెడీ అవుతున్నాడు. మే 11న రాజ్ తరుణ్, అమైరా దస్తూర్ జోడీగా నటించిన ‘రాజుగాడు’ విడుదల కానుంది. సంజనారెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. పలు విజయవంతమైన కామెడీ చిత్రాలను తెరకెక్కించిన ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్ర విడుదల వివరాలను రామబ్రహ్మం సుంకర మీడియాకు తెలిపారు. రాజ్‌ తరుణ్‌ మా బ్యానర్‌లో చేస్తున్న నాలుగో చిత్రమిది.

హిలేరియస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. హీరో క్యారెక్టరైజేషన్, రాజేంద్రప్రసాద్‌ కామెడీ ప్రత్యేక ఆకర్షణలు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కి విశేషమైన స్పందన రావడంతో పాటు సినిమా మీద మంచి హైప్‌ క్రియేట్‌ అయింది. త్వరలోనే ఆడియో విడుదల చేస్తాం. మా బ్యానర్‌లో ‘రాజుగాడు‘ మరో హిట్‌ సినిమాగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.

Next Story
Share it