చంద్రబాబు ఓ రాజకీయ బ్రోకర్

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై టాలీవుడ్ రచయిత, నటుడు పోసాని తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఓ పొలిటికల్ బ్రోకర్ అని ఆరోపించారు. ప్రత్యేక హోదా..ప్యాకేజీలకు సంబంధించి చంద్రబాబు ఎన్నో మాటలు మార్చారని..ఆయన ఏ మాట నమ్మి టాలీవుడ్ పరిశ్రమ ముందుకు రావాలని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ టాలీవుడ్ పై చేసిన విమర్శలపై పోసాని ఘాటుగా స్పందించారు. ‘మేం ఏసీ రూముల్లో కూర్చొని కులుకుతామని టీడీపీ నాయకులు అంటున్నారు. అవును, మాకు ఏదీ చేతకాదనుకుందాం, మరి మీరేం చేస్తున్నారు? ప్రత్యేక హోదా కోసం విజయవాడలో దీక్షకు వచ్చిన సినిమా వాళ్లని లాఠీలతో కొట్టించింది మీరుకాదా, ఒక్కొక్కరినీ తరిమితరిమి కొట్టిన సంగతి మర్చిపోయారా? నిన్నటిదాకా మీరేం మాట్లాడారు.. హోదా కోసం మాట్లాడినవాళ్లను చెత్తవెధవలని అనలేదా? మళ్లీ మీరిప్పుడు సడన్‌గా హోదా కావలంటుంటే మేం మద్దతివ్వాలా?. హోదానే వద్దని చంద్రబాబు చెబితే మనస్ఫూర్తిగా నమ్మాం.
ఒక ముఖ్యమంత్రి చెప్పే మాటల్లో నిజం ఉంటుందని ‘హోదా కన్నా ప్యాకేజీనే ముద్దు’ అనుకున్నాం. ఇప్పుడు మోదీతో చంద్రబాబుకు ఏవో గొడవలొస్తే అదేదో ఏపీ ప్రజల సమస్యగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? అప్పుడేమో ప్యాకేజీ, ఇప్పుడేమో ప్రత్యేక హోదా అంటూ మాటతప్పినవాళ్లను లోఫర్ అనేకదా అంటారు. ‘ఎస్సీల్లో పుట్టాలని కోరుకోరుకదా..’ని చంద్రబాబు అంటే మేం జేజేలు కొట్టాలా, డబ్బులిచ్చి పక్కపార్టీ ఎమ్మెల్యేలను కొనుకుక్కుంటే సంతోషంగా మద్దతు పలకాలా? బ్రోకర్ చంద్రబాబు మాటలు నమ్మి మేం పోరాటాలు చెయ్యాలా..’ అని పోసాని ఫైర్‌అయ్యారు. చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే బెంజ్ సర్కిల్ వద్ద 175 మంది ఎమ్మెల్యేలతో ఆమరణ దీక్షకు రెడీ కావాలని..పరిశ్రమ తరపున తాను కూడా హాజరవుతానని...ప్రాణ త్యాగం చేయటానికి అయినా రెడీ అని సవాల్ విసిరారు.
మునుగోడు ఉప ఎన్నిక..టీఆర్ఎస్ అనుకుంటే వస్తది..లేదంటే లేదు!
2 Aug 2022 2:38 PM GMTఎలన్ మస్క్ ప్రైవేట్ ఎయిర్ పోర్టు!
2 Aug 2022 12:41 PM GMTఏటీఎంలో 'స్ట్రక్ అయిన బిజెపి అగ్రనేతలు!'
2 Aug 2022 12:04 PM GMT'మ్యూట్' లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్!
2 Aug 2022 6:45 AM GMTదిల్ రాజు 'డబుల్ గేమ్' దుమారం!
1 Aug 2022 3:16 PM GMT
మునుగోడు ఉప ఎన్నిక..టీఆర్ఎస్ అనుకుంటే వస్తది..లేదంటే లేదు!
2 Aug 2022 2:38 PM GMTఏటీఎంలో 'స్ట్రక్ అయిన బిజెపి అగ్రనేతలు!'
2 Aug 2022 12:04 PM GMTజగన్ ..మీరు తోడుదొంగలు..సోము వీర్రాజుకు అమరావతి రైతుల షాక్!
29 July 2022 7:53 AM GMTగజ్వేల్ అయినా రెడీ..హుజూరాబాద్ అయినా ఓకే
26 July 2022 2:57 PM GMTమునుగోడు బలం బిజెపిదా..రాజగోపాల్ రెడ్డిదా?!
26 July 2022 10:58 AM GMT