Telugu Gateway
Cinema

జిల్..జిల్ జిగేల్ రాజా..

జిల్..జిల్ జిగేల్ రాజా..
X

జిల్ జిల్ జిగేల్ రాజా అంటూ సందడి చేస్తోంది పూజా హెగ్డె. ఈ నెల 30 విడుదల కానున్న రంగస్థలం సినిమాలోని ఐటెం సాంగ్ లోని హంగామా ఇదంతా. ఓ ముద్దు పెట్టవే జిగేల్ రాణి..కన్ను అయినా కొట్టవే జిగేల్ రాణి అంటూ హీరో రామ్ చరణ్ లుంగీ డ్యాన్స్ తో అదరగొట్టగా...హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఏ మాత్రం తగ్గకుండా స్టెప్పులతో ఊపేసింది. రామ్ చరణ్ పుట్టిన రోజు కావటంతో మంగళవారం నాడు ఈ పాటకు సంబంధించిన ప్రొమో సాంగ్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. పూర్తి మాస్ లుక్ లో ఉన్న ఈ పాటలో చరణ్ అదే మాస్ లుక్ డ్రెస్ తో స్టెప్పులు వేశాడు. ఈ సినిమా అంతా గ్రామీణ నేపథ్యంలో సాగటంతో రామ్ చరణ్ అంతా లుంగీతోనే ఎక్కువగా కన్పిస్తున్నాడు.

రామ్ చరణ్ అభిమానులు అంతా జిగేల్‌ రాణి ప్రోమో కోసమే ఎదురుచూశారు. అయితే ఈ ఐటెం సాంగ్ ప్రొమో చూస్తే మాత్రం అభిమానుల్లో కిక్కు వచ్చేలా కన్పించటం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సహజంగా ఐటెం సాంగ్ పెట్టేదే అభిమానుల్లో ఊపు తేవటం కోసం. ఈ పాటలో రామ్ చరణ్, పూజా హెగ్డేల డ్యాన్స్ లు బాగానే ఉన్నా....పాటలో ఊపు తక్కువ అయిందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

https://www.youtube.com/watch?v=kjSX2qC_znk

Next Story
Share it