Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ జోడీపై క్లారిటీ

ఎన్టీఆర్ జోడీపై క్లారిటీ
X

ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కు సంబంధించి పలు అంశాలపై స్పష్టత వచ్చేసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా నటించేది ఎవరో అధికారికంగా ప్రకటించారు. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లు పూజా హెగ్డే పేరునే ఈ సినిమాలో హీరోయిన్ గా ఖరారు చేశారు. ఈ విషయాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ అదికారికంగా ప్రకటించింది. అదే సమయంలో మ్యూజిక్ డైరక్టర్ బాధ్యతను కూడా తమన్ కు అప్పగిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ సినిమాకు సంబంధించి పలు అంశాలపై స్పష్టత వచ్చినట్లు అయింది.

పీఎస్‌ వినోద్‌ సినిమాటోగ్రఫి చెయనున్నట్లు ట్వీట్ చేసింది. తొలుత అనుకున్నట్లు మార్చి నుంచి కాకుండా ఏప్రిల్‌ లో సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభం కానుంది. హాసిని క్రియేషన్స్ ట్వీట్ పూజా కూడా రియాక్ట్ అయింది. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం భారీ ఎత్తున కసరత్తులు చేస్తూ సరికొత్తగా కనిపించే పనిలో ఉన్నారు. 2019 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Next Story
Share it