పవన్ కళ్యాణ్ ‘పొలిటికల్ ఫోటో షూట్’

జనసేనలో ఏదైనా సినిమాటిక్ గానే ఉండాలా?. చూస్తుంటే పరిస్థితి అలాగే ఉంది. పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ (జెఎఫ్ సి) కమిటీ ఏర్పాటు చేశారు. అంత వరకూ బాగానే ఉన్నా..దీని కోసం ఓ లోగో కూడా తయారు చేయించారు. సినిమా ఫస్ట్ లుక్ లాగా...జెఎఫ్ సీనే ఓ అంశంపై అధ్యయనం చేయటానికి ఏర్పాటైన తాత్కాలిక కమిటీ. దీనికి లోగో అవసరం ఏముందనే వ్యాఖ్యలు విన్పించాయి. ఈ వ్యవహారం మర్చిపోకముందే పవన్ కళ్యాణ్ అలాంటిదే మరో పని చేశారు. అదేంటి అంటే..పొలిటికల్ ఫోటో షూట్. ఈ మార్చి 13తో జనసేన పెట్టి నాలుగేళ్లు పూర్తి కానుంది.
ఈ సందర్భంగా గుంటూరులో భారీ ఎత్తున సభ ఏర్పాటు చేయటంతోపాటు ప్లీనరీ ద్వారా వచ్చే ఎన్నికల్లో జనసేన పాత్రకు సంబంధించి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా..దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కోసం ఓ ఫోటో షూట్ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను అధికారికంగానే జనసేన ఫేస్ బుక్ పేజీలో పెట్టారు. సినిమా షూటింగ్ కు ముందు ఇలాంటి ఫోటో షూట్ లు నిర్వహించటం ఆనవాయితీ. కానీ రాజకీయాల్లో కూడా ఇదెక్కడి పద్దతో అర్థం కావటంలేదనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మొత్తానికి రాజకీయాల్లోకి వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ సినిమా వాసనలు పోకుండానే రాజకీయం చేయటానికి రెడీ అయిపోయారు.
మునుగోడు ఉప ఎన్నిక..టీఆర్ఎస్ అనుకుంటే వస్తది..లేదంటే లేదు!
2 Aug 2022 2:38 PM GMTఎలన్ మస్క్ ప్రైవేట్ ఎయిర్ పోర్టు!
2 Aug 2022 12:41 PM GMTఏటీఎంలో 'స్ట్రక్ అయిన బిజెపి అగ్రనేతలు!'
2 Aug 2022 12:04 PM GMT'మ్యూట్' లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్!
2 Aug 2022 6:45 AM GMTదిల్ రాజు 'డబుల్ గేమ్' దుమారం!
1 Aug 2022 3:16 PM GMT
మునుగోడు ఉప ఎన్నిక..టీఆర్ఎస్ అనుకుంటే వస్తది..లేదంటే లేదు!
2 Aug 2022 2:38 PM GMTఏటీఎంలో 'స్ట్రక్ అయిన బిజెపి అగ్రనేతలు!'
2 Aug 2022 12:04 PM GMTజగన్ ..మీరు తోడుదొంగలు..సోము వీర్రాజుకు అమరావతి రైతుల షాక్!
29 July 2022 7:53 AM GMTగజ్వేల్ అయినా రెడీ..హుజూరాబాద్ అయినా ఓకే
26 July 2022 2:57 PM GMTమునుగోడు బలం బిజెపిదా..రాజగోపాల్ రెడ్డిదా?!
26 July 2022 10:58 AM GMT